Site icon NTV Telugu

Bhola Shankar: జగదేక వీరుడితో దర్శకేంద్రుడు…

Bhola Shankar

Bhola Shankar

మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ ని గుర్తు చేసుకుంటూ తెలుగు సినిమా బాక్సాఫీస్ ని ఎన్నో మెట్లు ఎక్కించిన, ఎన్నో రికార్డులని క్రియేట్ చేసిన సినిమాలు గుర్తొస్తాయి. ఈ హీరో-దర్శకుడు కలిసి బ్రేక్ చెయ్యని రికార్డ్ లేదు, సృష్టించని రికార్డు లేదు. అందుకే చిరు జగదేక వీరుడు అయితే, రాఘవేంద్ర రావు దర్శకేంద్రుడు అయ్యాడు. ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అదో బ్లాక్ బస్టర్ అనే నమ్మకాన్ని ప్రతిసారీ నిజం చేసిన చూపించిన చిరు, రాఘవేంద్ర రావు రీసెంట్ గా కలిసారు. చిరు, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోలా శంకర్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన కలకత్తా సెట్ లో జరుగుతుంది. తమన్నా హీరోయిన్ గా, కీర్తి సురేష్ సిస్టర్ రోల్ ప్లే చేస్తున్న భోలా శంకర్ సినిమాలోని ఒక పాటని ప్రస్తుతం చిత్ర యూనిట్ షూట్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఖిరియోగ్రఫి చేస్తున్న ఈ సాంగ్ షూటింగ్ స్పాట్ ని రాఘవేంద్రరావు విజిట్ చేశాడు.

షూటింగ్ ని చూసిన దర్శకేంద్రుడు ‘చూడాలని ఉంది’ సినిమాలోని కలకత్తా సెట్ గుర్తొచ్చిందని భోలా శంకర్ చిత్ర యూనిట్ కి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. చిరు, కీర్తి సురేష్, ఆనీ మాస్టర్, మెహర్ రమేష్, సురేఖ వాణీ, వెన్నల కిషోర్, గెటప్ శ్రీనులతో కలిసి రాఘవేంద్ర రావు ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగదేక వీరుడితో దర్శకేంద్రుడు అంటూ మెగా అభిమానులు ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో 250 కోట్లు రాబట్టిన చిరు, ఈసారి సమ్మర్ సీజన్ కి టార్గెట్ చేస్తూ ఏప్రిల్ నెలలో భోలా శంకర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ఈ మూవీతో చిరు మరో హిట్ కొడతాదేమో చూడాలి.

Exit mobile version