Prabhas : షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చి యూరప్ వెళ్తున్న ‘డార్లింగ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’, హను రాఘవపూడి డైరెక్షన్లో వస్తున్న ‘ఫౌజీ’ చిత్రాలతో పాటు బ్లాక్‌బస్టర్ హిట్స్ ‘సలార్’, ‘కల్కి 2898 AD’ సీక్వెల్స్ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. అయితే.. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్‌లతో తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్, త్వరలోనే కాస్త బ్రేక్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ హైదరాబాద్‌లో ‘స్పిరిట్’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. హీరో ప్రభాస్ మరియు హీరోయిన్ త్రిప్తి డిమ్రి పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇక స్పిరిట్ లేటెస్ట్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ప్రభాస్ ఒక చిన్న విరామం తీసుకోనున్నారు. సుమారు పది రోజుల పాటు వెకేషన్ కోసం ఆయన యూరప్ వెళ్లనున్నట్లు సమాచారం. యూరప్ టూర్ ముగించుకుని తిరిగొచ్చిన తర్వాత, ప్రభాస్ తన పూర్తి ఫోకస్‌ను ‘ఫౌజీ’ సినిమాపై పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రంతో ఇమాన్వి హీరోయిన్గా పరిచయమవుతోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. బ్యాలెన్స్ షూటింగ్‌ను కంప్లీట్ చేసే ప్లానింగ్‌లో ఉన్నాడు డార్లింగ్. ఆ తర్వాత స్పిరిట్ పూర్తి చేసి.. కల్కి 2 సెట్స్‌లో జాయిన్ అవనున్నాడు. ఇక ఆ తర్వాత సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతానికి ప్రభాస్ ఈ భారీ లైనప్‌తో బిజీగా ఉన్నాడు. అందుకే.. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుంటున్నాడని చెప్పొచ్చు.
Also Read
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!