Prabhas: టాలీవుడ్ లో లవ్ స్టోరీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన దర్శకుడు హను రాఘవపూడి. వరుస ప్లాపుల తరువాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ “ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది.. దుల్కర్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో, సూపర్ స్టార్ ఇన్ ది కంట్రీ, తెలుగులో మీరు చేసిన మహానటి.. గ్రేట్ ఫిల్మ్. అందరూ మీ నటనను ప్రశంసిస్తున్నారు. రామ్, సీత నటన గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది ఈజీ విషయం కాదు.. ఒక లవ్ స్టోరీని ఇంత ఫ్యాషన్ గా, ఇంత ఖర్చు పెట్టి.. యుద్దాన్ని కూడా చూపించారు. కాశ్మీర్ లో యుద్ధ సన్నివేశాలు తీసి.. ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదని తెలుస్తోంది. నాకు తెలిసి రష్యాలో షూట్ చేసిన మొదటి సినిమా ఇదే..
ఇక డైరెక్టర్ హను రాఘవపూడి సినిమాలను నేను చూశాను. చాలా బావుంటాయి. నాగ అశ్విన్ చెప్పినట్లు ఒక పొయిట్రీలా చూపిస్తారు సినిమాను.. ఇలాంటి డైరెక్టర్స్ మనకు ఉండడం చాలా అరుదు. సుమంత్.. మై డార్లింగ్.. మీరు చేసారంటే చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. కానీ ఆ పాత్ర చెప్పడం లేదు.. దానికోసం సినిమా చూడాల్సిందే .. ఇక దత్ గారు.. ఎన్టీఆర్ నుంచి ఇప్పటివరకు దాదాపు 50 సంవత్సరాలు ఇన్ని పెద్ద సినిమాలు తీస్తున్న నిర్మాత తెలుగులో ఉండడం మా అదృష్టం. కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి ఇది థియేటర్ కు వెళ్లి చూడాల్సిన సినిమా.. ఉదాహరణకు మన ఇంట్లో పూజా గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా.. మా సినిమా ఫీల్డ్ కు థియేటరే గుడి.. మీ వలనే ఇదంతా.. ఎంతో స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమా.. తప్పకుండా అందరూ థియేటర్లో చూడండి” అంటూ ముగించాడు.
