Site icon NTV Telugu

Dhanush: విడాకులు తీసుకొని రూ. 100 కోట్ల ఇల్లు కొన్న జంట.. ?

Dhanush

Dhanush

Dhanush: కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు ప్రకటించి చాలా నెలలు అయ్యింది. ఇక వీరిద్దరూ ప్రస్తుతం తమ తమ కెరీర్ లో బిజీగా కూడా మారారు. అయితే ఈ జంట మధ్య సంధి కుదిరిందని, విడాకులు రద్దు చేసుకుంటున్నారని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదని కొందరు అంటుండగా.. నిజమే అని మరికొందరు అంటున్నారు. అసలు మాకు కలిసి ఉండే ఉద్దేశ్యమే లేదని ఈ జంట చాలా క్లియర్ కట్ గా చెప్పుకొచ్చేసింది. మధ్య మధ్యలో ఈ జంట పిల్లలకోసం కలవడంతో వీరు మళ్లీ కలుస్తున్నారని పుకార్లు మొదలయ్యాయి.

 

తాజాగా ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసే వార్త బయటికి వచ్చింది.. అదేంటంటే.. ఈ స్టార్ కపుల్ రూ. 100 కోట్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశారట. వచ్చే ఏడాది జనవరిలో ఈ  జంట తమ పిల్లలతో సహా ఆ ఇంటిలోకి షిఫ్ట్ అవుతున్నారని టాక్ నడుస్తోంది.  తమ పిల్లలు యాత్రా రాజా, లింగ రాజా కోసం ఈ జంట కలిసిందని, ఇక నుంచి కొత్త ఇంట్లో కొత్త జీవితాన్ని మొదలుపెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. ఒకవేళ నిజమైతే అంతకన్నా సంతోషం ఏముంటుందని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ధనుష్ తెలుగులో సార్ సినిమాలో నటిస్తున్నాడు.

Exit mobile version