రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఇండియాస్ ఫస్ట్ లెస్బియన్ క్రైమ్ డ్రామా ‘డేంజరస్’. ఈ సినిమాలో ‘బ్యూటీఫుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘ధ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా ‘ఎ’ సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమాకు తెలుగులో ‘మా ఇష్టం’ అనే పేరు పెట్టారు. తెలుగు, హిందీ భాషల్లో దీనిని ఏప్రిల్ 8వ తేదీ విడుదల చేయబోతున్నట్టు వర్మ తెలిపారు. గురువారం తెలుగు సినిమా పోస్టర్ ను వర్మ ట్వీట్ చేశారు. లెస్బియన్ ఎఫైర్ అనేది చాలా మందిని చంపేసిందని, వారిలో పోలీసులు, గ్యాంగ్ స్టర్స్ కూడా ఉన్నారని ఆ అంశం మీదనే తానీ సినిమాను తీశానని వర్మ చెబుతున్నారు.
Read Also : Bheemla Nayak : ఫ్యాన్స్ విరాళాలు!