Suhani Bhatnagar: 19 ఏళ్లకే ‘దంగల్’ నటి కన్నుమూత.. యాక్సిడెంట్ లో బతికినా, అందుకే చనిపోయింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suhani Bhatnagar Passess Away: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమీర్ ఖాన్ హిట్ సినిమా ‘దంగల్’లో చిన్నారి బబితా ఫోగట్ పాత్ర పోషించిన బాల నటి సుహానీ భట్నాగర్ తాజాగా కన్ను మూశారు. ఈ వార్త సినీ పరిశ్రమలోని అందరినీ కలచివేసింది. సుహాని కేవలం 19 ఏళ్లకే ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. సుహాని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, ఆ అనారోగ్యం కారణంగా సుహాని ఈరోజు అంటే ఫిబ్రవరి 17, 2024న మరణించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
Gaami Teaser : విశ్వక్ సేన్ ‘గామి’ టీజర్ చూశారా? అఘోరగా విశ్వక్ అదరగోట్టాడుగా..
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
దంగల్ సినిమాలో బబితా ఫోగట్ పాత్రతో సుహానీ భట్నాగర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ పరిస్థితుల్లో సుహాని మృతి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 19 ఏళ్లకే సుహాని కన్నుమూసిందంటే అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఇక అందుతున్న సమాచారం మేరకు సుహాని మరణానికి కారణం ఆమె శరీరం మొత్తం నీరు పట్టడం అని అంటున్నారు. కొంత కాలం క్రితం సుహానీకి యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమె కాలు ఫ్రాక్చర్ అయింది. అదే సమయంలో, చికిత్స కోసం తీసుకున్న మందులకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని తెలుస్తోంది. వాటి కారణంగా ఆమె శరీరంలో నీరు పేరుకుపోవడం మొదలైంది. ఇక ఆ కారణంగా ఆమె చాలా కాలం నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అలా చికిత్స పొందుతూ ఆమె ఈరోజు మరణించింది. ఇక ఈ రోజు సుహాని అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
సుహాని చిన్న వయసులోనే పెద్ద పేరు సంపాదించింది. అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘దంగల్’ (2016)లో బబితా ఫోగట్ పాత్రను పోషించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు అందాయి. ఇదే కాక ఆమె అనేక టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపించింది. అయితే ‘దంగల్’ తర్వాత చాలా సినిమాల నుంచి ఆఫర్లు వచ్చినా నటనకు విరామం ఇవ్వాలని సుహాని నిర్ణయించుకుంది. ఆమె చదువుపై దృష్టి పెట్టాలనుకుంది. చాలా ఇంటర్వ్యూలలో, సుహాని తన చదువు పూర్తి చేసిన తర్వాత, తాను తిరిగి సినిమా పరిశ్రమకు రావాలని అనుకున్నట్లు చెప్పింది. కానీ అది తీరని కోరికగానే మిగిలిపోయింది.
తాజావార్తలు
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!