Dance Icon: ఓటిటీ.. ప్రస్తుతం సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డిజిటల్ రంగం. కుటుంబంతో కలిసి ఇంట్లోనే కూర్చొని ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా చూస్తున్నారు. ఇక ప్రేక్షకుల అభిరుచిని బట్టే ఓటిటీ యాజమాన్యం కూడా సినిమాలు, షోలను ప్లాన్ చేస్తున్నాయి. టీవీ లో వచ్చే షోలను కూడా ఓటిటీలోకి తెచ్చేస్తున్నారు. ఇప్పటికే టాక్ షో, సింగింగ్ షోలను పరిచయం చేసిన ఆహా ఓటిటీ తాజాగా డాన్స్ షో ను కూడా మొదలుపెట్టింది. ఓంకార్ యాంకర్ గా ఆహా లో డాన్స్ ఐకాన్ పేరుతో ఒక షో రాబోతోంది. ఈ షో ను విజయ్ దేవరకొండ, అనన్య పాండే లాంచ్ చేయనున్నారు.
ఇక ఈ షోలో విశేషమేంటంటే.. ఇందులో పాల్గొన్న డ్యాన్సర్లను ప్రముఖ నిర్మాతలు డబ్బులిచ్చి కొంటారు. ఎవరైతే గెలుస్తారో వారికి స్టార్ హీరోను కొరియోగ్రాఫ్ చేసే ఛాన్స్ ఇస్తారు. ఇక డ్యాన్సరలను కొనడానికి ప్రముఖ నిర్మాతలందరిని తీసుకొచ్చేశాడు ఓంకార్ అన్నయ్య. అల్లు అరవింద్ తో పాటు బీవీఎస్ రవి, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత తదితరులు పాల్గోయ్ డ్యాన్సర్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. సెప్టెంబర్ 11 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ షో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
