NTV Telugu Site icon

Tollywood : ‘దక్కన్ సర్కార్’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

Dakkan Sarakar

Dakkan Sarakar

కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ దక్కన్ సర్కార్. తాజాగా దక్కన్ సర్కార్ పోస్టర్, టీజర్ లాంచ్ కార్య‌క్ర‌మం తెలుగు ఫిలిం ఛాంబ‌ర్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొని చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.

తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి మాట్లాడుతూ.. ”తెలంగాణ ఉద్యమంలోని కష్టాలను ఈ సినిమాలో చూపించారు. ఉద్యమంలో పని చేసిన కళా శ్రీనివాస్ ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి ఈ సినిమా తీశాడు. ఉద్య‌మాన్ని చూపిస్తున్న ఇలాంటి సినిమాను ప్ర‌తి ఒక్క‌రు ఆద‌రించాలి. చిత్ర‌యూనిట్‌ను అభినందిస్తున్నాను.” అని అన్నారు.

డైరెక్ట‌ర్ కళా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్ప‌ది, ఇక్క‌డి ప్రకృతి ఎంతో బాగుంటుంది. తెలంగాణలో ప్రతి అంశంపై సినిమా తీయొచ్చు. తెలంగాణ సినిమాలు ఇంకా ఎన్నో రావాల్సి ఉంది. ఈ క్ర‌మంలో తెలంగాణ ఉద్య‌మాన్ని తెరపై ఆవిష్క‌రించాము. నిజ జీవితంలో మంచి క్యారెక్టర్ ఉన్న వారినే సినిమాలో క్యారెక్ట‌ర్లుగా తీసుకున్నాను. పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో ఈ సినిమా చేశాను. సాయి చంద్, జై శ్రీను వంటి తెలంగాణ ఆణిముత్యాలను కోల్పోయాం. ఉద్య‌మ క‌ళాకారుల‌ను, నా ఆత్మీయుల‌ను ఈ సంద‌ర్భంగా త‌లుచుకోవ‌డం భావోద్వేగంగా ఉంది. ‘దక్కన్ సర్కార్’ ఆడియో లాంచ్ త్వరలో నిజామాబాద్‌లో భారీగా నిర్వహించబోతున్నాము. ఈ సినిమాను ఆద‌రించాల‌ని ప్ర‌తి ఒక్క‌రిని కోరుకుంటున్నాను. మా సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్య‌క్ర‌మంకు వ‌చ్చిన అతిథుల‌కు, తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు, మీడియా మిత్రుల‌కు పేరుపేరున కృత‌జ్ఞ‌త‌లు ” అని అన్నారు.