NTV Telugu Site icon

Daaku Maharaaj : నెట్ ఫ్లిక్స్ లో డాకుమహారాజ్ సంచనలం.. ఏకంగా పాకిస్థాన్ లో

Daaku Maharaaj

Daaku Maharaaj

నందమూరి బాల‌కృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘డాకు మ‌హారాజ్’. బాలయ్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సిన వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 170 కోట్లకు పైగా వ‌ర‌కు గ్రాస్, రూ.85 కోట్ల‌కుపైగా షేర్ క‌లెక్ష‌న్స్‌ రాబట్టింది. ఈ సినిమాతో బాలయ్య వరుసగా  వంద కోట్లు కొల్లగొట్టిన నాలుగు సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు.

Also Read : RAM : RAPO 22 టీమ్ కు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి స్పెషల్ విషెష్

అయితే థియేటర్లో  దుమ్ముదులిపిన డాకు మహారాజ్ డిజిట‌ల్ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది.  ఫిబ్ర‌వ‌రి 21 నుంచి   తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది నెట్ ఫ్లిక్స్. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోను సెన్సేషన్ చేస్తుంది డాకు మహారాజ్.ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న సినిమాలలో డాకు మహారాజ్ మొదటి స్తానంలో నిలిచింది. అలాగే బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, సింగపూర్, నైజీరియా, యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎమిరేట్స్, కెన్యా, ఒమాన్ లో టాప్ – 2లో ట్రెండింగ్ అవుతుంది. అలాగే పాకిస్తాన్ లోను టాప్ -2 లో ట్రేండింగ్ అవుతున్నాడు డాకు మహారాజ్. ప్యూర్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన డాకు మహారాజ్ కు ఓటీటీ లోను అదరగొడుతుంది. పుష్ప 2 తర్వాత వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ లో టాప్ లో నిలిచింది డాకు మహారాజ్. ఈ  సినిమాకు తమన్ అందించిన సంగీతం ఇటీవల కాలంలో బెస్ట్ మ్యూజిక్ అనే చెప్పాలి.