Site icon NTV Telugu

దుమ్మురేపుతున్న “దాక్కో దాక్కో మేక”… బన్నీ ఖాతాలో మరో రికార్డు

Daakko Daakko Meka is the Most Viewed South Indian Lyrical

ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” ఒకటి. సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్, స్టిల్స్, ఎలాంటి అప్‌డేట్ అయినా సరే ఉత్సుకతని రేకెత్తిస్తున్నాయి. ఇక తాజాగా బన్నీ ఖాతాలో మరో రికార్డు చేరింది. నిన్న ఈ సినిమా నుంచి విడుదలైన “దాక్కో దాక్కో మేక” సాంగ్ హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఈ సాంగ్ ఇప్పుడు 24 గంటల వ్యవధిలో అత్యధికంగా వీక్షించిన, లైక్ చేసిన టాలీవుడ్ లిరికల్‌ వీడియోగా సెన్సేషన్ సృష్టిస్తోంది. “దాక్కో దాక్కో మేకా” కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే 9.4 మిలియన్ వ్యూస్, 657 వేల లైక్‌లను నమోదు చేసింది. 5 భాషల్లో విడుదలైన ఈ సాంగ్ ఇతర వెర్షన్లు కూడా చాలా బాగున్నాయి.

Read Also : మళ్ళీ మొదలైంది : మోస్ట్ కన్ఫ్యూజ్డ్ బ్యాచిలర్ గా సుమంత్

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన పాట విజువల్స్, ఎడిటింగ్‌ కు విశేషంగా ప్రశంసలు కురుస్తున్నాయి. విశాల్ దడ్లాని (హిందీ), విజయ్ ప్రకాష్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు) మరియు బెన్నీ దయాళ్ (తమిళ్) ఐదు వెర్షన్లలో సాంగ్ ను పాడారు. కాగా “పుష్ప” రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ లుక్, సుకుమార్ దర్శకత్వం ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Exit mobile version