Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ కమ్ నిర్మాతల మధ్య అంతర్గతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు బ్లాస్ట్ అయింది. గ్రూపులుగా విడిపోయిన నిర్మాతలు, మరియు సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణపై ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునే వరకు వెళ్ళింది. శిరీష్, సునీల్ నారంగ్, చదలవాడ శ్రీనివాసరావు ఒక పక్షాన ఉండగా.. నవీన్ ఎర్నేని, నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి మరో వర్గంగా ఎవరికీ వారు విమర్శలు చేసుకున్నారు.
Also Read
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదం పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎదురవుతున్న సవాళ్లు, థియేటర్ల యాజమాన్యాల సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతలు మరియు ప్రముఖ ఎగ్జిబిటర్లు తమ గళాన్ని వినిపించారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సుప్రియ యార్లగడ్డ, స్రవంతి రవి కిషోర్, సి. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రవి, చెర్రీ మరియు యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని కూడా ఈ చర్చల్లో భాగస్వాములయ్యారు. సినీ ఎగ్జిబిటర్ల తరపున ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాత సునీల్ నారంగ్, విజయేందర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు హాజరై థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఓటీటీ ప్రభావం, టికెట్ ధరలు మరియు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. పరిశ్రమలోని అన్ని వర్గాల మధ్య సమన్వయం పెంచడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్లు సమాచారం.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు