D Boss: ప్రేమికుల రోజు అయిపోగానే బాస్ సినిమా అప్డేట్ వస్తుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ది బాస్ అనే మాట వినగానే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరో దర్శన్ గుర్తొస్తాడు. యష్, సుదీప్, ఉపేంద్ర, శివన్న, పునీత్, రిషబ్, రక్షిత్ శెట్టిలాగా తెలుగు సినీ అభిమానులకి దర్శన్ పెద్దగా తెలియదు కానీ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న తెలుగు వాళ్లకి మాత్రం బాగా తెలుసు. తెలుగులో పవన్ కళ్యాణ్ ఎలాగో కన్నడలో దర్శన్ అలాగా… పాన్ ఇండియా ఆడియన్స్ కి వాళ్లు ఎక్కువగా తెలియదేమో కానీ సొంత ఇండస్ట్రీలో వాళ్లని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ ఉండదు. అంతటి స్టార్ హీరో అయిన దర్శన్, 2021లో రెండు సినిమాలు చేశాడు. ఇందులో ‘రాబర్ట్’ అనే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. వంద కోట్లు రాబట్టిన ఈ మూవీ తర్వాత దర్శన్ ఏడాది గ్యాప్ తీసుకోని మళ్ళీ 2023లో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ‘క్రాంతి’ సినిమాతో ఈ రిపబ్లిక్ డేకి ఆడియన్స్ ముందుకి వచ్చిన దర్శన్ సాలిడ్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. రెండు వారాల్లో క్రాంతి సినిమా 35 కోట్ల షేర్ ని రాబట్టి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి 2023లో మంచి స్టార్ట్ ఇచ్చింది.
క్రాంతి మూవీ కలెక్షన్స్ విషయంలో గ్రాస్ ఎక్కువ చెప్పారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి కానీ దర్శన్ ఫాన్స్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా క్రాంతి సినిమాని రిపీట్ మోడ్ లో చూస్తున్నారు. ఈ మూవీ రిజల్ట్ ఇచ్చిన జోష్ లో దర్శన్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చెయ్యబోతున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ ప్రొడ్యూస్ చేస్తున్న దర్శన్ 56 ( #D56 ) సినిమాకి తరుణ్ కిషోర్ దర్శకత్వం వహించనున్నాడు. ఫిబ్రవరి 16న D56 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యనున్నారు. ఈ మూవీ ప్రీలుక్ ని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ లో కత్తి మాత్రమే ఉండడంతో దర్శన్ మరోసారి పూర్తిస్థాయి కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమా చెయ్యబోతున్నాడు అని ఫాన్స్ ఫిక్స్ అయ్యారు. దర్శన్ మాస్ సినిమా చేస్తే హిట్ కొట్టడం గ్యారెంటీ అనే నమ్మకం అక్కడి ఆడియన్స్ లో ఉంది.
Also Read
తాజావార్తలు
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!