NTV Telugu Site icon

Vijay Devarkonda: దేవరకొండపై అసభ్యకర వార్తలు ప్రసారం.. ఛానల్ నిర్వాహకుడి అరెస్ట్!

Vijay Deverakonda Finally Opens Up On His Marriage

Vijay Deverakonda Finally Opens Up On His Marriage

Cyber Police Arresed a Man for Defaming Vijay Deverakonda: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. అయితే సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మెట్లు ఎక్కుతూ పాన్ ఇండియాలో ఈ స్థాయికి వచ్చిన విజయ్ దేవరకొండపై తాజాగా అసభ్యకర వార్తలు ప్రసారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం అయన సినిమాలకు సంబంధించి అసభ్యకర వార్తలను ప్రసారం చేశారు. సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆయనను అవమానిస్తూ అసత్యపు వార్తను ప్రసారం చేశాడు అనంతపురంకు చెందిన వెంకట కిరణ్ అనే వ్యక్తి. విజయ్ దేవరకొండ గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్న, ఆయన సినిమాలలోని హీరోయిన్ లను అవమానిస్తూ చేసిన ఈ యూట్యూబ్ వీడియోలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి సదరు వ్యక్తి ఆచూకీని తెలుసుకున్నారు.

Fatima Vijay Antony: ఈ క్షణం నుంచి దేవుడు లేడు, ఆయన్ని నమ్మితే అంతే.. విజయ్ ఆంటోనీ భార్య షాకింగ్ ట్వీట్!

కేసు నెంబర్: 2590/2023 గా కేసును ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలనీ, ఛానల్ ని డిలీట్ చేయించారు. అంతేకాదు భవిష్యత్ లో ఇలాంటివి చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు టార్గెటెడ్ గా ఎవరు వ్యాఖ్యలు చేసినా, మీడియా మాధ్యమాలలో అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు