Site icon NTV Telugu

ప్రతి తెలంగాణ సినిమా కు 50 లక్షల సబ్సిడీ : సివిఎల్ నర్శింహ రావు

‘మా’ ఎన్నికల అధ్యక్ష అభ్యర్థిగా సివిఎల్ నర్శింహ రావు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అటు సివిఎల్ నర్శింహ రావు కు బీజేపీ పార్టీ కూడా మద్దతు తెలిపింది. అయితే.. తాజాగా సివిఎల్ నర్శింహ రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని… బీజేపీ అధికారంలోకి రాగానే… అంతర్జాతీయ ఫిల్మ్, టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

read also : ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ..

ప్రతి తెలంగాణ సినిమా కు 50 లక్షల సబ్సిడీ కూడా ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని థియేటర్లు ను చిన్న సినిమాలకు వంతుల వారిగా కేటాయింపులు చేస్తామని.. తెలంగాణ సినిమాలకు వినోద పన్ను కూడా మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు. షూటింగ్ లొకేషన్ ఉచితంగా కేటాయిస్తామని చెప్పిన సివిఎల్ నర్శింహ రావు.. సినిమా కార్మికుల సంక్షేమం వర్కర్స్ యాక్ట్ అమలు చేస్తామని పేర్కొన్నారు.

Exit mobile version