Site icon NTV Telugu

Sobhita Dhulipalla: ఆ కాయిన్ నా జీవితాన్ని మార్చేసింది..

Sobitha

Sobitha

Sobhita Dhulipalla: అచ్చ తెలుగందం.. శోభితా దూళిపాళ్ల. వైజాగ్ అమ్మాయిగా ఇప్పుడు మంచి పేరు తెచ్చుకుంటున్న శోభితా కెరీర్ ను బాలీవుడ్ మూవీతో మొదలుపెట్టింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతను.. రచ్చ గెలిచి ఇంట గెలవాలి అనేలా మార్చేసింది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో మంచి మంచి పాత్రలతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో గూఢచారి సినిమాతో పరిచయమైంది. ఇక ఈ మధ్య ది నైట్ మేనేజర్ సిరీస్ తో మరింతపాపులారిటీని తెచ్చుకున్న శోభితా పర్సనల్ గా అక్కినేని హీరో నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇద్దరు కలిసి ఎన్నోసార్లు మీడియా ముందు కనిపించారు. కానీ, అసలు వారు మాత్రం మాకు తెలియదు అనే విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా ఈ భామ కపిల్ శర్మ షోలో మెరిసింది. ఇక ఆ షోలో అసలు తాను ఎలా హీరోయిన్ గా మారింది.. ? ఎలా ముంబై వెళ్ళింది.. ? అనేది చెప్పుకొచ్చింది.

Sreeleela: ఈ అందాన్ని ఏ హీరో వదులుతాడు.. చెప్పండి

” వైజాగ్ లో చదువు పూర్తయిన తర్వాత పెద్ద సిటీకి వెళ్లాలని అనుకున్నా. అప్పుడు నా ఛాయిస్ బెంగుళూరు, ముంబై. ఈ రెంటింటిలో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కాయిన్ తో టాస్ వేశాను. ముంబై వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లా. అక్కడకు వెళ్ళాక నా లైఫ్ మొత్తం మారిపోయింది. ఆ కాయిన్ నా జీవితాన్ని మార్చేసింది.” అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శోభిత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ముంబై వచ్చింది కాబట్టి బాలీవుడ్ .. అదే బెంగుళూరు వస్తే .. కన్నడలో మెరిసేదానివి.. అంతే ఖచ్చితంగా నటిగా అయితే మారేదానివి అంటూ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version