Site icon NTV Telugu

Sukumar: లెక్కల మాస్టారే అసలైన గురూజీ…

Sukumar

Sukumar

తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్ద దిక్కుగా ఉన్న లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణ ఎంతోమంది శిష్యుల్ని రెడీ చేశారు. సినిమానే ప్రపంచంగా బ్రతుకుతూ, తెలుగు సినిమాకి టెక్నికల్ హంగులు అద్ది, గ్రాఫిక్స్ తో వండర్స్ చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ, దాసరి గారి శిష్యుడే. వందకి పైగా సినిమాలని డైరెక్ట్ చేసిన కోడి రామకృష్ణ, గురువుకి తగ్గ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. దాసరి తర్వాత ఆ స్థాయిలో అసిస్టెంట్ లని దర్శకులుగా చేసిన ఘనత రామ్ గోపాల్ వర్మకే దక్కుతుందేమో. ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకులు, ఆయన ఇన్స్పిరేషన్ తో వచ్చిన దర్శకులు ఒకరు ఇద్దరూ కాదు ఈరోజు సగం ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ వర్మ శిష్యగణమే. అందులో టాప్ ప్లేస్ లో ఉండే దర్శకుడు పూరి జగన్నాథ్, కేవలం హీరో క్యారెక్టర్ పైన స్టొరీ రాసి ఇండస్ట్రీ హిట్ కొట్టగల సత్తా ఉన్న ఏకైక దర్శకుడు పూరి మాత్రమే. ఆయన బాలీవుడ్ కి వెళ్లి అమితాబ్ బచ్చన్ ని డైరెక్ట్ చేశాడు అంటే వెనక ఉన్న వర్మ అండనే ముఖ్య కారణం. ఆ మధ్య కాలంలో రాజమౌళి కాంపౌండ్ నుంచి కూడా ఇద్దరు అసిస్టెంట్ లు దర్శకులుగా బయటకి వచ్చారు కానీ ఇండస్ట్రీలో తమ మార్క్ చూపించలేకపోయారు. వర్మ శిష్యుడు అయిన పూరి నుంచి కూడా కొంతమంది దర్శకులు వచ్చారు కానీ వారిలో హరీష్ శంకర్ మాత్రమే తన మార్క్ చూపించాడు.

దాసరి గారు, ఆర్జీవీ తర్వాత ఆ స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్స్ ని డైరెక్టర్స్ మార్చిన మరో దర్శకుడు సుకుమార్ మాత్రమే. లెక్కల మాస్టారుగా తనకంటూ సెపరేట్ రైటింగ్ అండ్ మేకింగ్ స్కిల్స్ మైంటైన్ చేసే సుకుమార్, ఇప్పటికే ఇండస్ట్రీకి నలుగురు సాలిడ్ డైరెక్టర్స్ ని ఇచ్చాడు. సుక్కూ క్యాంప్ నుంచి అందరికన్నా ముందుగా బయటకి వచ్చిన వాడు ‘సూర్యప్రతాప్ పల్నాటి’. కుమార్ 21F సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు సూర్య ప్రతాప్. ఈ మూవీ నుంచి సుకుమార్ రైటింగ్స్ మొదలయ్యింది. సూర్య ప్రతాప్ పర్వాలేదు మంచి సినిమా చేశాడు అని ప్రతి ఒక్కరితో అనిపించుకున్నాడు కానీ ఆ తర్వాత వచ్చిన బుచ్చిబాబు మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉప్పెన సినిమా చేసిన బుచ్చిబాబు, బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. తెలుగులో ఇలాంటి పాయింట్ ని యాక్సెప్ట్ చెయ్యరు అనుకున్న పాయింట్ తో సెన్సేషనల్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు సన. ఈరోజు బుచ్చిబాబు రెండో సినిమాకే రామ్ చరణ్ తేజ్ తో పాన్ ఇండియా సినిమా చేసే స్థాయికి చేరుకున్నాడు.

బుచ్చిబాబు ప్రేమకథతో వచ్చి సెన్సేషనల్ హిట్ కొడితే, సుకుమార్ మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల మాస్ సినిమాతో మరో రంగస్థలాన్ని తలపించేలా ‘దసరా’ సినిమా చేశాడు. నాని హీరోగా నటించిన ఈ మూవీ వంద కోట్లు కలెక్ట్ చేసింది. ఫ్యూచర్ సుకుమార్ అని పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెలకి గాలం వేసే పనిలో ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రేమ కథ, కమర్షియల్ కథలు కాదు నేను థ్రిల్లర్ కథతో హిట్ కొడతాను అంటూ విరుపాక్ష సినిమాతో బయటకి వచ్చాడు కార్తీక్ దండు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యి యునానిమస్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో డివైడ్ టాక్ అనేది లేకుండా కేవలం హిట్ టాక్ మాత్రమే వినిపించింది విరుపాక్ష సినిమాకి మాత్రమే.

ఇలా నలుగురు శిష్యులని దర్శకులుగా మార్చిన సుకుమార్, వీరి సినిమాలకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా సాలిడ్ స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. ఈ  స్టూడెంట్స్ కూడా సుకుమార్ లాగే సైలెంట్ గా ఉంటారు, సాలిడ్ గా సినిమా చేస్తారు, బాక్సాఫీస్ ని షేక్ చేసే రేంజులో హిట్స్ కొడతారు. త్వరలో సుకుమార్ కాంపౌండ్ నుంచి మరో దర్శకుడు బయటకి వస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది. మరి అతను ఎలాంటి సినిమాతో బయటకి వస్తాడు అనేది చూడాలి.

Exit mobile version