Site icon NTV Telugu

‘క్రేజీ అంకుల్స్’ నుంచి మరో క్రేజీ లిరికల్ సాంగ్

బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి సందడి చేయనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, పాటలతో సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. మరో పక్క శ్రీముఖి కూడా గ్లామర్ తో కళకళ్లాడిపోతోంది. తాజాగా సినిమాలోని ‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటీ’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. భోలే శవాలి దీనికి ట్యూన్ సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఈ సాంగ్ కు ఆనంద్ గుర్రం సాహిత్యం అందించారు.

https://youtu.be/CA0lk0GqAk0
Exit mobile version