Site icon NTV Telugu

Pawan Kalyan OG: యూనిట్‌లో చేరిన క్రేజీ నటుడు.. మరింత వైబ్రెంట్‌గా ఓజీ

Arjun Das In Og

Arjun Das In Og

Crazy Actor Joins In Pawan Kalyan OG: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. ఇంతకుముందు ప్రభాస్‌తో ‘సాహో’ చేసిన యువ దర్శకుడు సుజీత్ ఈ ‘ఓజీ’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇది క్రేజీ కాంబినేషన్ కావడం వల్ల.. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా.. పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒక రియల్ గ్యాంగ్‌స్టర్ అవతారంలో పవన్‌ని చూడాలనుకుంటున్న తమ కల.. ఈ సినిమాతో నెరవేరబోతున్న తరుణంలో, ‘ఓజీ’ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Varun Varuntej – Lavanya Tripathi : వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ లో హైలెట్గా నిలిచిన పవన్ కళ్యాణ్..

ఇప్పుడు ఆ అభిమానుల అంచనాల్ని రెట్టింపు చేస్తూ.. ఓజీ మేకర్స్ తాజాగా మరో మైండ్‌బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో కోలీవుడ్ యువ నటుడు అర్జున్ దాస్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని అధికారికంగా ప్రకటించాడు. అంతేకాదు.. అర్జున్ టోన్, ప్రెజెన్స్ కారణంగా.. తమ ఓజీ సినిమా మరింత వైబ్రెంట్‌గా ఉండబోతోందని ఓ క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ అర్జున్ దాస్‌ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇతడు ‘విక్రమ్’ సినిమాలో, అంతకుముందు ‘ఖైదీ’ మూవీలో విలన్‌గా నటించి మెప్పించాడు. ఆ రెండు సినిమాల పుణ్యమా అని, అతనికి తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడు ఇతను ఓజీలో చేరడంతో.. పవన్, అర్జున్‌ల మధ్య ఎపిసోడ్‌లు పీక్స్‌లో ఉంటాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వీరి కాంబోని చూస్తుంటే.. ‘పంజా’లో పవన్, అడవి శేష్‌ని చూస్తున్న వైబ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ నెట్టింట్లో తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు.

NBK109: అఫీషియల్.. ఆ బ్లాక్‌బస్టర్ దర్శకుడితో బాలయ్య నెక్ట్స్ మూవీ

కాగా.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మి్స్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూల్స్.. ముంబై, పూణెలలో పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో నడుస్తోంది.

Exit mobile version