పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ OTT కిక్ నిన్న సాయంత్రం ప్రారంభమైంది. నాగార్జున మళ్లీ షోను హోస్ట్ చేస్తున్నారు. అషు రెడ్డి నుండి అరియానా గ్లోరీ వరకు చాలా మంది ప్రముఖులు ఈ బిగ్ బాస్ OTTలో కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో ఈ షోపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీపీఐ నారాయణ ఈ రియాలిటీ షోను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఇది బిగ్ బాస్ హౌస్ అని పిలిచే వ్యభిచార గృహమని, అసభ్యకరమైన విషయాలను ప్రోత్సహిస్తూ ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని, షో అనుమతిని రద్దు చేయాలని సంచలన కామెంట్స్ చేశారు.
Read Also : Bheemla Nayak : ఎలక్ట్రిఫైయింగ్… మహేష్ బాబు రివ్యూ
నారాయణ చేసిన వ్యాఖ్యలపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి ఇచ్చిన సమాధానం నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా జరిగిన ఓ టీవీ డిబేట్‌లో తమన్నా మాట్లాడుతూ ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నారాయణను చెప్పులతో కొట్టాలని అన్నారు. ఈ టీవీ డిబేట్‌లోని ఇతర నిపుణులు తమన్నా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె అభ్యంతర వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ తమన్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బిగ్ బాస్ షోను సమర్థిస్తూ అదే తమకు గుర్తింపు తెచ్చిపెట్టిందని, బయట ఊహిస్తున్నది నిజం కాదని అన్నారు. పైగా షో నచ్చనివాళ్ళు ఛానల్ మార్చుకోవచ్చంటూ సలహా ఇచ్చింది.
