Shivaji : కోర్టు సినిమాలోని తన మంగపతి క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నాడు శివాజీ. కోర్టు సినిమా విజయోత్సవంలో భాగంగా సినిమా యూనిట్ విజయవాడలోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందులో శివాజీ, ప్రియదర్శి, దర్శకుడు రామ్ జగదీష్, హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి ఉన్నారు. అనంతరం వీరు విజయవాడలోని ప్రముఖ హోటల్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా నటుడు శివాజీ మాట్లాడుతూ మూవీని తన కెరీర్ లో మంగపతి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన తనకు మంగపతి పాత్ర దక్కడం సంతోషంగా ఉందన్నాడు. ఇక నుంచి ఇలాంటి వైవిధ్యభరితమైన పాత్రలే ఎక్కువగా చేయాలనుకుంటున్నట్టు తెలిపాడు.
read also : Niharika : సొంత బ్యానర్ లో నిహారిక భారీ సినిమా..
ఫోక్సో చట్టం గురించి, ప్రేమ, పెద్దల బాధ్యతలను తెలియజేసే సినిమా ఇది అన్నారు. నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం తనకు సంతోషంగా ఉందన్నాడు. ప్రియదర్శి మాట్లాడుతూ మొదటిసారి లాయర్ పాత్రలో నటించానని.. చాలా సంతోషంగా ఉందన్నాడు. సినిమా పెద్ద హిట్ కావడం సంతోషంగా ఉందని చెప్పాడు. డైరెక్టర్ రామ్ జగదీశ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ముందు ఎంతో రీసెర్చ్ చేశానని.. తనను నమ్మి నాని సినిమా ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉందన్నాడు. ఇలాంటి సినిమాలు ప్రజల్లో అవగాహన పెంచుతాయన్నాడు.