పవర్ స్టార్ ఫ్యాన్స్ అసలు సిసలైన పండుగకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అవుతోంది పవన్ స్టార్ ఆర్మీ. ఇప్పటికే సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ అయిపోయింది. కామన్ డీపీ, గుడుంబా శంకర్ రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు. ఇక పవన్ కొత్త సినిమాల నుంచి ట్రిపుల్ ధమాకా రాబోతోంది. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిలో హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ ‘ఓజి’, క్రిష్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ మూడు సినిమాల నుంచి పవన్ పుట్టిన రోజు సందర్భంగా సాలిడ్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఓజి నుంచి అదిరిపోయే ట్రీట్ ఉంటుందని డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు అనౌన్స్ చేశారు. అంతేకాదు.. హై ఓల్టేజ్ టీజర్ కట్ చేసినట్టు టాక్ ఉంది.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే ఉస్తాద్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే హరిహర వీమల్లు పరిస్థితేంటి? అనేదే క్లారిటీ లేకుండా పోయింది. చాలా రోజులుగా ఈ సినిమా డిలే అవుతు వస్తోంది. ఇప్పట్లో తిరిగి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు తక్కువ అని అంటున్నారు. పవన్ పొలిటికల్ పరంగా బిజీగా ఉండడం వల్ల ఎలక్షన్స్ తర్వాతే హరిహర వీరమల్లు ఉంటుందనేది ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. కానీ పవన్ బర్త్ డే గిఫ్ట్‌గా హరిహర వీరమల్లు నుంచి స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట క్రిష్. మొత్తంగా సెప్టెంబర్ 2న పవన్ ఫ్యాన్స్‌కు బర్త్ డే గిఫ్ట్ మామూలుగా ఉండదని చెప్పొచ్చు.