మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు “Ghani” అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. మెగా అభిమానులను ఎంతగానో వెయిట్ చేయించిన “గని” పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు థియేటర్లలోకి ఏప్రిల్ 8న రానుంది. ఈ సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా, “Ghani”కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ? అనే విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. “Ghani” ఆ గండం నుంచి గట్టెక్కినట్టేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : RGV : రాముడు కాదు రావణుడిని… నెటిజన్ కు వర్మ వెరైటీ రిప్లై
ఆ గండమేంటి ? అసలా కథేంటి ? అంటే… రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” మేనియా సాగుతోంది ప్రస్తుతం. జక్కన్న ఈ సినిమాతో సృష్టించిన ఇంట్రెస్ట్, హీట్ ఇంకా ఏమాత్రం తగ్గనేలేదు. సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా… ఇంకా థియేటర్లలో “ఆర్ఆర్ఆర్” సందడి ఆగనేలేదు. తగ్గేదే లే అంటూ దూసుకెళ్తున్న “ఆర్ఆర్ఆర్”ను తట్టుకుని నిలబడడానికి మిగతా హీరోలు ధైర్యం చేయట్లేదు. అందుకే “ఆర్ఆర్ఆర్” విడుదలై రెండు వారాలు గడిచి పోతున్నా పెద్ద సినిమాలేవీ విడుదల కాలేదు. కానీ ఫలితం, టైం గురించి ఎదురు చూడకుండా కంటెంట్ పై ఆశలు పెట్టుకుని, “ఆర్ఆర్ఆర్” మేనియా నడుస్తుండగానే విడుదలైన “మిషన్ ఇంపాజిబుల్”కు ఎదురు దెబ్బ తప్పలేదు. కంటెంట్ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటే తప్ప గండంగా మారిన “ఆర్ఆర్ఆర్”ను గట్టెక్కడం కష్టం.
ఇక “Ghani” విషయానికొస్తే… స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అంతేకాకుండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అటెండ్ అవ్వడం, తమన్నా స్పెషల్ సాంగ్ తో పాటు మెగా అభిమానుల అండ ఉండనే ఉంది. మరి “ఆర్ఆర్ఆర్”కు భారీ గ్యాప్ తీసుకుని వస్తున్న “Ghani” ఆ గండాన్ని గట్టెక్కి, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడతాడా? అనేది చూడాలి. ఈ సినిమా నిజంగా అన్ని ఆటుపోట్లను తట్టుకుని హిట్ సాధిస్తే, RRRతో పాటు నిలబడిన మొదటి హీరో వరుణ్ తేజ్ అవుతాడు.
