లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం కూలి. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ గా ఉంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకెళ్తోంది కూలీ.
Also Read : Breaking : కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం కానున్న నిర్మాతలు..
ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ. 68.5 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం. అయితే ఈ బుకింగ్స్ కార్పొరేట్ బుకింగ్స్ అని తాజాగా సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఓ థియేటర్ ఓనర్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూలి కోసం కార్పొరేట్ బుకింగ్స్ చేసారు. ఇంతకు ముందు ఏ సినిమాలకు దక్షిణాదిలో ఇలా జరగలేదు. రజనీకాంత్ సినిమాకు మూడు రోజుల వరకు కార్పోరేట్ బుకింగ్ చేసారని అన్నారు. అయితే క్లారిటీ ఏంటంటే కార్పరేట్ కంపెనీలు సూపర్ స్టార్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బ్లాక్ చేసి తమ తమ ఉద్యోగులకు టికెట్స్ అందిస్తున్నాయి. ఇదంతా కేవలం సూపర్ స్టార్ క్రేజ్ కారణంగానే. కానీ కొందరు పనిగట్టుకుని వార్ 2 తో కూలీ పోటీగా వస్తుందని నెగిటివ్ ప్రోపగాండా క్రియేట్ చేసారు. వార్ 2 కంటే కూలీ బుకింగ్స్ జోరు చూపిస్తున్నాయన్నది వాస్తవం. మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న రెండు సినిమాలలో టాక్ ఏది బాగుంటే దానికి కలెక్షన్స్ ఉంటాయి. మరి ఈ భారీ వార్ లో చివరికి గెలిచేది ఎవరో చూడాలి;.
