భారీ అంచనాలు, భారీ హైప్, భారీ బుడ్జెట్ తో తెరకెక్కిన రెండు డబ్బింగ్ సినిమాలైన వార్ 2, కూలీ మొత్తానికి ఆగస్టు 14న రిలీజ్ అయ్యాయి. వార్ 2 కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, కూలీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. వార్ 2 లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తే కూలీలో రజనీకాంత్, ఉపేంద్ర, నాగార్జున, అమిర్ ఖాన్ వంటి హేమ హేమీలు ఉన్నారు. రెండు సినిమాలు స్ట్రయిట్ తెలుగుసినిమాలు అనే రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టాయి.
Also Read : Suriya 46 : సూర్య- వెంకీ అట్లూరి సినిమాలో బాలీవుడ్ కపూర్.. ఫిక్స్
కానీ తొలిరోజు తొలి ఆట నుండే రెండు సినిమాలు మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నాయి. వార్ 2 లో యాక్షన్ తప్ప కథ లేదని టాక్ రాగా, కూలీ లోకేశ్ కనకరాజ్ వీకేస్ట్ రైటింగ్ అనే విమర్శలు వచ్చాయి. అయినా సరే కూలీ మొదటి రోజు రికార్డు స్థాయి నంబర్ రాబట్టింది. సౌత్ బెల్ట్ మొత్తం కూలీ భారీ వసూళ్లు కొల్లగొట్టింది. అటు వార్ 2 కూడా ఎన్టీఆర్ అనే స్టార్ ఇమేజ్ ఉండడంతో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పడు ఈ సినిమాలు రెండు మొదటి వీకెండ్ ఫినిష్ చేసుకున్నాయి. నేడు సోమవారం వర్కింగ్ డే ఇక రోజు నుండి ఈ సినిమాల అసలు రూపం బయటకు వస్తుంది. ఇప్పటికే రెండు సినిమాలు కింద సెంటర్స్ లో కలెక్షన్స్ లో బాగా డ్రాప్ అయ్యాయి. వార్ 2 భారీ నష్టాల దిశగా సాగుతుంది. కూలీ కూడా కొంత మేర నష్టాలు వచ్చేలా ఉన్నాయి ట్రెండ్ చూస్తుంటే. అసలే ఓ వైపు భారీ వర్షాలు, మరోవైపు సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్, అడ్వాన్స్ బుకింగ్స్ సైతం అంతంత మాత్రం. మరి ఈ మండే టెస్ట్ లో ఈ రెండు సినిమాలు ఎలా పర్ఫామ్ చేస్తాయో చూడాలి.
