Site icon NTV Telugu

Coolie : ‘కూలీ’ లో మరో ట్విస్ట్..యంగ్ రజనీ పాత్రలో స్టార్ హీరో ఎంట్రీ !

Coolea

Coolea

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కూలీ’ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారో, తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తితో వేచి చూస్తున్నారు. ట్రైలర్ ద్వారా ఈ సినిమా స్టైల్, మాస్ ఎలిమెంట్స్ గురించి ఇప్పటికే ఒక అంచనా వచ్చేసింది. ఈసారి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కంటెంట్‌కే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది.

Also Read : Sreeleela : శ్రీలీలకు తమిళ్‌లో మరో బంపర్ ఆఫర్?

ఇక ప్రీ-రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలలో లోకేష్ మాట్లాడుతూ .. ‘మీరు ఊహించని సర్ప్రైజ్‌లు ఈ సినిమాలో ఉంటాయి’ అని చెప్పాడు. అన్నట్లుగానే ఒక సర్ప్రైజ్ ఇప్పటికే లీక్ అయింది. ట్రైలర్ చివర్లో కనిపించే రజనీకాంత్ ఫ్లాష్‌బ్యాక్ షాట్‌లో ఉన్నది వింటేజ్ రజనీకాంత్ కాదు, ప్రముఖ యంగ్ హీరో శివ కార్తికేయన్ అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఫ్లాష్‌బ్యాక్‌లో రజనీకాంత్ మాస్ వేరే లెవెల్‌లో ఉంటాడని, ఆ పాత్రను ప్రత్యేకంగా శివ కార్తికేయన్‌తో చేయించారని ప్రచారం జరుగుతుంది. లోకేష్ కూడా ఫ్లాష్‌బ్యాక్ విషయంలో ‘ఇంత వరకు ఎవరు ప్రయత్నించని విధంగా చేశాను’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రజనీకాంత్‌కు యంగ్ గెటప్ వేసి చేయించలేదని, ప్రత్యేకంగా చెప్పడం చూస్తే ఈ రూమర్ నిజమనే అనిపిస్తుంది. ఇది నిజంగా ఒక డేరింగ్ ప్రయోగం అనే చెప్పాలి.

Exit mobile version