Constable Kanakam : వర్షబొల్లమ్మ మెయిన్ లీడ్ లో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఆగస్టు 14 మధ్య రాత్రి నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ను ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేయగా.. సీనియర్ ప్రొడ్యూసర్ కోవెలమూడి సాయి బాబా గారు, హేమంత్ కుమార్ నిర్మించారు. మేఘలేఖ, రాజీవ్ కనకాల కీలక పాత్రలు చేశారు. ట్రైలర్ తో మంచి అంచనాలు రేపిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రీకాకుళం అడవి ప్రాంతంలో జరిగే మిస్టరీల చుట్టూ ఇది తిరుగుతుంది. అక్కడ వరుసగా అమ్మాయిలు కనిపించకుండా పోతారు. అలాంటి టైమ్ లో అక్కడ కానిస్టేబుల్ గా జాయిన్ అయిన కానిస్టేబుల్ కనకం.. ఈ మిస్టరీలను ఎలా ఛేదించింది.. ఆమెకు ఎదురైన అనుభవాలు ఏంటి అనేది థ్రిల్లర్ హర్రర్ సస్పెన్స్ ను తలపించేలా తెరకెక్కించారు.
Read Also : Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. బాలీవుడ్ డ్యామేజ్..
ఈ కథ అంతా పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ లోనే సాగుతుంది. నాలుగో ఎపిసోడ్ నుంచి కథ రసవత్తరంగా మారుతుంది. దర్శకుడు ప్రశాంత్ దిమ్మల పాత్రలను, కథను పరిచయం చేయడంలో కొంత టైమ్ తీసుకున్నా.. ప్రేక్షకులను కథలో లీనం చేయగలిగాడు. వర్ష బొల్లమ్మ అమాయకమైన కానిస్టేబుల్‌గా కనిపిస్తూనే.. సీరియస్ సీన్లలో చురుగ్గా కనిపిస్తుంది. మేఘలేఖ, రాజీవ్ కనకాలకు ఇచ్చిన కీలక పాత్రలకు న్యాయం చేశారు. అలాగే అవసరాల శ్రీనివాస్ ఊరి ప్రెసిడెంట్ గా ఒక వికలాంగుడి పాత్రలో మెప్పించారు. DOP శ్రీరామ్, BGMతో సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్‌లో మాధవ్ గుళ్లపల్లి ఆకట్టుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సిరీస్ పైరసీ కాకుండా ఈటీవీ విన్ విజయవంతంగా సేవ్ చేసింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయిన కొన్ని గంటల్లోనే మంచి రెస్పాన్స్ రావడంతో డిజిటల్ హక్కుల పరిరక్షణలో ప్రొఫెషనల్ యాక్షన్ తీసుకోవడం వల్ల కాంటెంట్ పైరసీ కాకుండా ఈటీవీ విన్ అలెర్ట్ అయింది.
Read Also : Kishkindhapuri : కిష్కిందపురి టీజర్ రిలీజ్.. భయపెట్టేస్తున్న బెల్లంకొండ..
