NTV Telugu Site icon

Jacqueline Fernandez Birthday: జాక్వెలిన్‌కి గ్యాంగ్‌స్టర్ సుఖేష్ చంద్రశేఖర్ బర్త్ డే స్పెషల్ లవ్ లెటర్

Jacqueline Fernandez, Sukesh Chandrashekhar

Jacqueline Fernandez, Sukesh Chandrashekhar

Chandrashekhar Pens Love Letter For Actress Jacqueline Fernandez: నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆమెకు సినీ ప్రముఖులు, అభిమానులందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షించిన విషెస్ మాత్రం గ్యాంగ్‌స్టర్ సుఖేష్ చంద్రశేఖర్ వే. జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమలేఖ రాశాడు. అంతేకాదు జాక్వెలిన్‌కి తన చేతులతో గ్రీటింగ్ కార్డ్ కూడా సిద్ధం చేసి రిలీజ్ చేశాడు. సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక క్రియేటివ్ గ్రీటింగ్‌ సిద్ధం చేశాడు. గ్రీటింగ్ కవర్ పై ‘హ్యాపీ బర్త్ డే, ఐ మిస్ యూ’ అని రాసి ఉంది. కవిత్వం రాస్తూ ఆమె పట్ల తన హృదయ భావాలను వ్యక్తం చేశాడు. సుకేష్ రాసిన ఈ ప్రేమలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైలు నుంచి రాసిన లేఖలో సుకేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్‌ను ‘బేబీ’ అని సంబోధించాడు.

Rani Mukherjee: స్టార్ హీరోయిన్‌ ఇంట తీవ్ర విషాదం.. ఇంత బాధను ఎలా భరించిందో?

దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నా ‘బేబీ’ నీ పుట్టినరోజు ప్రతి సంవత్సరం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు, నా స్వంత పుట్టినరోజు కంటే ఇది నాకు చాలా ముఖ్యం. నువ్వు రోజురోజుకు మరింత అందంగా, యవ్వనంగా మారుతున్నావు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానని ఆయన రాసుకొచ్చారు. మీడియా కథనాల ప్రకారం, సుకేష్ చంద్రశేఖర్ తరపు న్యాయవాది శుక్రవారం ఈ లేఖను విడుదల చేశారు. బేబీ, నా పుట్టినరోజు బహుమతి మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, నువ్వు జంతువుల కోసం పనిచేస్తున్న తీరు నాకు అర్థమైందని, వచ్చే ఏడాది జాక్వెలిన్‌తో పుట్టినరోజు జరుపుకుంటానని సుకేష్ జాక్వెలిన్‌కి హామీ ఇచ్చాడు. లేఖ చివర్లో సుకేష్ ఇలా రాశాడు, ‘బేబీ, మై బొమ్మా, నువ్వు సూపర్ స్టార్, చాలా ప్రత్యేకమైనదానివి, నా జీవితంలో ఎప్పుడూ జరగని గొప్పదనం నువ్వే అని రాసుకొచ్చాడు. ‘ 200 కోట్ల మేర మోసం చేసి మోసం చేసిన కేసులో సుకేష్‌ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కూడా పోలీసులు చాలాసార్లు ప్రశ్నించారు.