NTV Telugu Site icon

Leo Collections: ఎంత మోసం చేశారు మావా?

Leo Producer

Leo Producer

Comscore reported exaggerated Collections for Leo Movie: విజయ్ హీరోగా నటించిన లియో మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయని సినిమా యూనిట్ చెబుతుంది. అయితే కామ్‌స్కోర్ వెబ్ సైట్ ఈ సినిమా యూనిట్ కలెక్షన్స్ ను పెంచి చెప్పిందని అంటున్నారు. ఈ లియో సినిమా వీకెండ్ లో 48.5 M వసూలు చేసిందని కామ్‌స్కోర్ రిపోర్ట్ చేసింది. అంటే ఈ సినిమా వారాంతపు కలెక్షన్లు 400 కోట్ల కంటే ఎక్కువ అని రిపోర్ట్ చేసింది. ఇక ఈ నివేదికను చూసిన విజయ్ అభిమానులు థ్రిల్ అయ్యారు కానీ ఇది వాస్తవం కాదు. ఈ సినిమా వారాంతంలో దాదాపు 355 కోట్ల రూపాయలను వసూలు చేసిందని, కామ్‌స్కోర్ రిపోర్ట్ చేసిన నెంబర్లు చాలా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

Hansraj Raghuvanshi Wedding: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సింగర్

కామ్‌స్కోర్ దాదాపు 50 కోట్లు పెంచి రిపోర్ట్ చేసిందని తెల్సింది. ఇక కామ్‌స్కోర్ లియో కోసం ఈ కలెక్షన్స్ ను బాగా పెంచి రిపోర్ట్ చేయడంతో విజయ్ అభిమానులను ఎద్దేవా చేస్తూ ఇతర హీరోల నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే లియో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే వసూలు చేస్తున్నాడు. ఈ లియో సినిమా విజయ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలవడమే కాక ఇపుడు పండుగ సీజన్ కూడా కావడంతో ఈ వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.