NTV Telugu Site icon

Mohan Lal: ‘జల్లికట్టు’ దర్శకుడితో కంప్లీట్ యాక్టర్ కొత్త సినిమా…

Mohan Lal

Mohan Lal

మలయాళ సినీ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన మూవీ ‘జల్లికట్టు’. న్యూ ఏజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లీజో జోస్ పెల్లిసరీ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో లీజో జోస్ పెల్లిసరీ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, ఏకంగా మోహన్ లాల్ పిలిచి సినిమా ఇచ్చే అంత స్టార్ దర్శకుడు అయిపోయాడు లీజో జోస్ పెల్లిసరీ. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, న్యూ ఏజ్ డైరెక్టర్ లీజో జోస్ పెల్లిసరీ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనే అనౌన్స్మెంట్ బయటకి రాగానే కేరళ సినీ అభిమనులు ఒక మాస్టర్ పీస్ సినిమా చూడబోతున్నాం అనే గట్ ఫీలింగ్ లోకి వచ్చేసారు. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తోనే ప్రేక్షకుల్లో భారి అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ టైటిల్ లో చిత్ర యూనిట్ ప్రకటించారు. “మలైకొట్టై వలిబన్” (మాలైకొట్టై కి చెందిన యువకుడు) అనే టైటిల్ ని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

Read Also: Mohanlal: చిక్కుల్లో మలయాళ స్టార్.. ఈడీ నోటిసులు

ఈ సినిమాలో మోహన్ లాల్ రెజ్లర్ గా కనిపించానున్నాడట. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న “మలైకొట్టై వలిబన్” సినిమాకి ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తుండగా, మధు నీలకందన్ సినిమాటోగ్రఫి వర్క్ చేస్తున్నాడు. ఈ భారి ప్రాజెక్ట్ ని జాన్ మేరీ క్రియేటివ్, సెంచరీ ఫిల్మ్స్, మాక్స్ లాబ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ దాదాపు రాజస్థాన్ లోనే జరుపుకోనుందని సమాచారం. “మలైకొట్టై వలిబన్” సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: లూసిఫర్ Vs గాడ్ ఫాదర్.. అక్కడెవరు.. ఇక్కడెవరు

Show comments