NTV Telugu Site icon

35 ఏళ్లుగా మా కుటుంబాల మధ్య పోటీ : ఎన్టీఆర్

NTR

NTR

జక్కన్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు మేకర్స్ ప్రమోషన్స్ దూకుడుగా చేస్తున్నారు. ‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ తరువాత రాజమౌళి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రంలో ఎవరి పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయమై చర్చ నడుస్తోంది. సినిమా ప్రమోషన్స్ సమయంలో ఎన్టీఆర్ మల్టీస్టారర్ ట్రెండ్ గురించి ఓపెన్ అయ్యాడు.

ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు మల్టీస్టారర్‌లో నటించలేదు. మొదటిసారి రామ్ చరణ్‌ తో కలిసి స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్న తారక్ ఈ సినిమా గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈ సమయంలో ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ ఊపందుకుంటుందా? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ సానుకూలంగా స్పందించారు. తారక్… రామ్ చరణ్‌తో తన ఈక్వేషన్ గురించి చెప్పుకొచ్చాడు. “నాకు ఆ విషయం గురించి అంతగా తెలియదు. కానీ గత 35 సంవత్సరాలుగా మా కుటుంబాల మధ్య పోటీ ఉంది. నేను, రామ్ చరణ్ చాలా మంచి స్నేహితులం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తర్వాత, పరిశ్రమలోని స్టార్స్ భవిష్యత్తులో మరిన్ని మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లు చేయడానికి ముందుకు వస్తారు” అని అన్నారు. కాగా ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.