Common Points in Japan – Jigarthanda Double X Movies: ఈ శుక్రవారం రెండు తమిళ సినిమాలు జపాన్, జిగర్‌తండా డబల్ ఎక్స్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల ఓపినింగ్ కలెక్షన్స్ మొదలు చాలా విషయాల్లో కామన్ పాయింట్స్ ఉన్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలు మంచి క్రేజ్ తో రిలీజ్ అయ్యాయి. అయితే కార్తీకి ఉన్న క్రేజ్తో జపాన్ కు డీసెంట్ ఓపినింగ్స్ వచ్చాయి కానీ టాక్ దారుణంగా ఉంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో జిగర్తాండ సీక్వెల్ గా రాఘవ లారెన్స్, SJ సూర్య మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన జిగర్తాండ డబల్ ఎక్స్ సినిమాకి ఓపినింగ్స్ లేవు కానీ టాక్ బాగుంది.
Shanthala : కన్నీళ్లు ఆగలేదు.. నియంత్రించుకోలేకపోయా, వెంకయ్య నాయుడు ఎమోషనల్!
హీరో కార్తి 25వ చిత్రంగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జపాన్’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఇక మరో ప్రక్క ఈ రెండు సినిమాల్లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ హీరోలు కార్తీ, రాఘవ లారెన్స్ ఇద్దరివీ నెగిటివ్ పాత్రలే. చివర్లో వారిద్దరూ మంచిగా మారతారు కానీ ఈ రెండు హీరో పాత్రలు కూడా సినిమా క్లైమాక్స్ లో చనిపోతాయి. హీరోల పాత్రల పేర్లు జపాన్, సీజర్- ఇవి రెండూ ఇంగ్లీష్ లో ఉండే పేర్లే. రెండు సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. దీంతో ఈ పాయింట్స్ మీద సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.