NTV Telugu Site icon

Committee Kurrollu: ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్.. కొత్త ట్రెండ్ మొదలెట్టిన నిహారిక

Niharika Konidela About Pawan Kalyan

Niharika Konidela About Pawan Kalyan

Committee Kurrollu to Stream in ETV WIN: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరణతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఎప్పుడూ లేనిది ‘కమిటీ కుర్రోళ్ళు’ టీం ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది. ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ లో ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి మరోసారి థాంక్ యూ సో మచ్. నా ఇండస్ట్రీ జర్నీ ఈటీవీ డీ జూనియర్స్ షో తో స్టార్ట్ చేశాను. నన్ను ఆడియన్స్ కి పరిచయం చేసిన ఈటీవీకి థాంక్ యూ సో మచ్. ఈటీవిలో వచ్చే కంటెంట్ మీ మా మన అనుకునేలా వుంటుంది.

Devara: దేవర ట్రైలర్ రివ్యూ.. ఇదేంటి ఆ సినిమాలు గుర్తొస్తున్నాయ్?

‘కమిటీ కుర్రోళ్ళు’ అలాంటి సినిమానే. మీ సినిమాలా అనుకొని తీశాం. ఈ సినిమా ఈటీవీలో రావడం మేము తీసుకున్న బెస్ట్ డెసిషన్. సెప్టెంబర్ 12న ఈటీవి విన్ లో మా ‘కమిటీ కుర్రోళ్ళు’ రీరిలీజ్ అవుతుంది. థియేటర్ లో ఎలా అయితే పండగ, జాతరలా ఎంజాయ్ చేశారో, ఈటీవీ విన్ లో కూడా చూసి అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు. డైరెక్టర్ యదు వంశీ మాట్లాడుతూ..‘కమిటీ కుర్రోళ్ళు’ని ప్రేక్షకులు వోన్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. మీ అందరికీ రుణపడి వుంటాను. ఈ సినిమాలో నటించిన అందరూ గొప్ప నటులుగా కెరీర్ లో ముందుకు వెళ్తారు. ఈ అవకాశం ఇచ్చిన నిహారిక గారికి, రమేష్ గారికి ధన్యవాదాలు. ఒక మెమరనీ బంధించి , అందరి బయోపిక్ గా సినిమాని మీ ముందుపెట్టాం. ఈ సినిమా ఈటీవి విన్ లో రావడం చాలా ఆనందంగా వుంది. ఇది పక్కా తెలుగు సినిమా. ఇలాంటి సినిమా ఈటీవీ విన్ లో వుండాలి. ఈ సినిమాని ప్రోత్సహించి నిహారిక గారికి, ఈటీవి విన్ కి ధన్యవాదాలు. 12న ఈ సినిమా ఈటీవీ విన్ లో వస్తుంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలి’ అని కోరారు.

Show comments