Comedy Stock Exchange To Start From December 2: ఇప్పటికే పలు షోస్ తో ఆడియన్స్ ను అలరిస్తున్న ‘ఆహా’ డిసెంబర్ 2 నుంచి ఆహ్లాదకరమైన హాస్యాన్ని పండించే మరో షోతో ముందుకు రానుంది. ఈ షో ద్వారా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, నటుడు సుడిగాలి సుధీర్ ఆడియన్స్ కు పూర్తి స్థాయి వినోదాన్ని పంచబోతున్నారు. పలువురు పాపులర్ కమెడియన్స్ ఈ షోలో పాల్గొనబోతున్నారు. ఈ కామెడీ స్టాక్ ఎక్సేంజ్ షోకి ఛైర్మన్ గా అనిల్ రావిపూడి వ్యవహరించనుండగా సుడిగాలి సుధీర్, దీపిక పిళ్ళై హోస్ట్ చేయబోతున్నారు. ఇక కమెడియన్స్ వేణు, ముక్కు అవినాశ్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేస్వర్ వంటి హాస్య నటులు కితకితలు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు.
ఈ షోలో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయట. ఇందులో పాల్గొనే కమెడియన్ కి లైవ్ ఆడియన్స్ ఓటు చేస్తారు. ఎక్కువ ఓట్లు సాధించిన వారు ఛైర్మన్ మనసు గెలుచుకుని టాప్ స్టాక్ గా పేరు తెచ్చుకుంటారు. దాదాపు 10 ఎపిసోడ్స్ ఈ షో లో ఉంటాయట. ఈ షో ద్వారా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘హాస్యంలోని కోణాలను ఆవిష్కరించటానికి మంచి ప్లాట్ ఫామ్ దొరికినందుకు ఆనందంగా ఉంది. ఈ షో ద్వారా ఆడియన్స్ కి సరికొత్త రీతిలో పరిచయం కాబోతున్నందుకు సంతోషంగా ఉది’ అన అన్నారు. తొలిసారి ఆహాలో ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ ‘ఇప్పటి వరకూ నన్ను ఆదిరించిన ప్రేక్షకుల ప్రోత్సాహంతో ఈ షోలో అడుగుపెడుతున్నాను. ప్రతి ఇంటిలో ఈ షో ద్వారా నవ్వులు పూయిస్తాననే నమ్మకం ఉంది’ అని చెబుతున్నాడు. మరి ఈ షోకి ఎలాంటి ప్రజాదరణ దక్కుతుందో చూద్దాం.