Site icon NTV Telugu

కామెడీ చేయడం కష్టం అంటున్న సామ్

Samantha Concentration on Shakunthalam

కామెడీ చేయడం కష్టం అంటోంది సమంత. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) లో ఉత్తమ నటిగా (తెలుగు) అవార్డు అందుకున్న తర్వాత సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నేను ఈ సినిమా ఎందుకు చేయాలనుకున్నానంటే కామెడీ నాకు కొత్త. అందుకే ప్రయత్నించాలని అనుకున్నాను. ఆ సినిమాలో నటిస్తున్నప్పుడు నేను చాలా సరదాగా గడిపాను. కామెడీ చాలా కష్టం అని గ్రహించాను. షూటింగ్ సమయంలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో దాన్ని బట్టి సినిమా విజయాన్ని అంచనా వేస్తాను. నేను ‘ఓ బేబీ’ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రతి రోజూ ఆనందించాను. నేను నందిని రెడ్డి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది.

Read Also : “ఆర్సీ15″లో హైలెట్ ఎపిసోడ్… ఆ సీన్లకే షాకింగ్ బడ్జెట్

ఈ రోజు కూడా నేను బయటకు వెళ్ళినప్పుడు ‘ఓ బేబీ’ బాగుందని చెప్తున్నారు. ఈ సినిమా ద్వారా నేను విభిన్న తరాలతో కనెక్ట్ అవ్వగలిగినందుకు నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. నటిగా నేను ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే విధానం, ప్రేక్షకులు నాతో తిరిగి కనెక్ట్ అయ్యే విధానం చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఈ సినిమా విడుదలకు ముందే నా మనసులో హిట్ అయ్యింది. భావోద్వేగ సన్నివేశాల కంటే హాస్యం చాలా కష్టం. ‘ఓ బేబీ’లో పని చేసిన తర్వాత హాస్య నటులను నేను మరింతగా అభినందిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది సామ్.

“ఓ బేబీ” సినిమాలో సమంత బేబీ అనే విభిన్నమైన పాత్రలో నటించింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ లో అనుకోకుండా ఆమె యవ్వన దశలోకి తిరిగి అడుగు పెడుతుంది. ఆమె జీవితంలో అంతకు ముందు కన్న కలలు, కోరికలను తిరిగి తీర్చుకుంటుంది.

Exit mobile version