“ఆర్సీ15″లో హైలెట్ ఎపిసోడ్… ఆ సీన్లకే షాకింగ్ బడ్జెట్

విజనరీ డైరెక్టర్ శంకర్ తదుపరి చిత్రం రామ్ చరణ్ హీరోగా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ మరోసారి జత కట్టనుంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్త మెగా అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ అంటున్నారు. కేవలం ఆ సన్నివేశానికే కోట్లలో బడ్జెట్ కేటాయిస్తున్నారట.

Read Also : బిగ్ బాస్ హౌస్ లో ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’

వార్తల ప్రకారం… శంకర్ ఈ సినిమాలో భారీ రైలు ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్నాడు. రైలు ఎపిసోడ్ సినిమాలో కీలకమైన సమయంలో వస్తుంది. సినిమాకి ప్రధాన హైలైట్‌గా ఉండనున్న ఈ యాక్షన్ స్టంట్ లో రామ్ చరణ్‌తో పాటు వందలాది మంది ఫైటర్స్ పాల్గొంటారని సమాచారం. ఈ సీక్వెన్స్ ద్వారా హీరో హీరోయిజంను ఎలివేట్ చేయనున్నాడట శంకర్. ఈ రైలు ఎపిసోడ్ కోసం శంకర్ ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేయనున్నాడని సమాచారం. ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేక రైలు సెట్ ను కూడా నిర్మిస్తున్నారట.

ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది. శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ సోషల్ డ్రామాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

-Advertisement-"ఆర్సీ15"లో హైలెట్ ఎపిసోడ్… ఆ సీన్లకే షాకింగ్ బడ్జెట్

Related Articles

Latest Articles