కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోలు, హీరోయిన్ల ఇంట పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రానా, నిఖిల్, కార్తికేయ, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ అంతా తమ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టేశారు. ఇటీవలే లేడీ కమెడియన్ విద్యుల్లేఖరామన్ కూడా పెళ్లి చేసుకుంది. తాజాగా టాలీవుడ్ కు చెందిన టాప్ కమెడియన్లు ఇద్దరూ ఒకేరోజు పెళ్లిళ్లు చేసుకున్నారు. యువ హాస్యనటులు జబర్దస్త్ అవినాష్, వివా హర్ష బుధవారం తమ తమ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. ఈ రెండు పెళ్లిళ్లు హైదరాబాద్‌లో జరిగాయి. ఆగష్టులో అవినాష్ కు అనూజ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బుధవారం జరిగిన ఈ వివాహానికి వివాహానికి ప్రముఖ టీవీ తారలు వర్షిణి సౌందరరాజన్, శ్రీముఖి, బిత్తిరి సత్తి, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రోల్ రిడా, సోహెల్, అలేక్య హారిక, దివి, లాస్య హాజరయ్యారు.
Read Also : పారితోషికం పెంచేసిన కీర్తి సురేష్
మరోవైపు వివా హర్ష తన చిరకాల స్నేహితురాలు అక్షర రీసుతో ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం కూడా బుధవారమే జరగడం విశేషం. వారి వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు దర్శకుడు రవికాంత్ పెరెపు, నటి సలోని లూత్రాతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఇద్దరు కమెడియన్ల అభిమానులు వారికి పెళ్లి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
