NTV Telugu Site icon

Dhanraj: డైరెక్టర్ అవుతున్న మరో జబర్దస్త్ కమెడియన్?

Dhanraj

Dhanraj

Comedian Dhanraj to turn director Soon: ఇటీవల, జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి బలగం సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత జబర్దస్త్ కమెడియన్ శాంతికుమార్ కూడా డైరెక్టర్ గా మారి ఒక సినిమా డైరెక్ట్ చేశాడు కానీ డి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు మరో తెలుగు కమెడియన్ దర్శకుడిగా మారేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన ఇంకెవరో కాదు కమెడియన్ ధనరాజ్. ధనరాజ్ ఒకప్పుడు టాలీవుడ్‌లో చాలా మంచి యంగ్ కామెడియన్. ఇప్పటికే హీరోగా కూడా ఒకటి రెండు సినిమాలు చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు తెలుగులో దర్శకుడిగా మారేందుకు సిద్ధం అవుతున్నాడు. సముద్రకని ప్రధాన పాత్రలో నటించే తెలుగు సినిమాతో ధనరాజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడని అంటున్నారు. ధనరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ZEE5 సంస్థ నిర్మించనుందని అంటున్నారు.

Shah Rukh Khan: షారుఖ్ కి వై ప్లస్ భద్రత ఎలా ఉంటుందో తెలుసా?

ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. నటీనటులు -సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా వెల్లడి కానున్నాయి అని అంటున్నారు. ధన్ రాజ్ ప్రస్తుతం జబర్దస్త్ లో లేదు. మరో పక్క సినిమాల్లోనూ కమెడియన్ గా ధనరాజ్ కి అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో దర్శకుడిగా మారుతున్నాడని అంటున్నారు. ఈమధ్య విమానం అనే సినిమా షూటింగులో నటుడు సముద్రఖనికి ధన్ రాజ్ కథ వినిపించగా ఆ కథ సముద్రఖనికి బాగా నచ్చిందని ఈ క్రమంలో వెంటనే సినిమాలో నటించేందుకు సముద్రఖని ఒప్పుకున్నారని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ దసరా తర్వాత మొదలు కాబోతుందని, దసరా రోజున లాంచనంగా షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు. తెలుగు, తమిళం భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కూడా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది కానీ కోస్తా ఆంధ్ర నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. సముద్రఖని కాకుండా మిగతా నటీనటులు అందరూ కొత్తవారని అంటున్నారు. దసరాకి అధికారికంగా లాంచ్ కానున్న ఈ సినిమా 2024లో థియేటర్లలోకి రానుంది.

Show comments