Site icon NTV Telugu

Comedian Ali: పదవి ఇచ్చిన వెంటనే సీఎం ను కూతురు పెళ్లికి ఆహ్వానించిన ఆలీ

Ali

Ali

Comedian Ali: కమెడియన్ ఆలీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఇంకోపక్క బుల్లితెరపై టాక్ షో నడుపుతూ, ఇంకోపక్క నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా మారాడు. ఇక సినిమాలు విషయం పక్కన పెడితే మొదటి నుంచి వైసీపీ లో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నాడు.ఇక మధ్యలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఆలీ మారుతున్నాడని వార్తలు వచ్చినా ఆలీ వాటిని కొట్టిపడేశాడు. తానెప్పుడూ జగన్ అభిమానినే అని, వైసీపీని దాటి బయటికి వచ్చేదిలేదని ఖరాకండిగా చెప్పేశాడు. ఇక ఈ నిజాయితీ నచ్చి ఇటీవల జగన్.. ఆలీని ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా నియమించారు. దీంతో ఆలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇక ఈ నేపథ్యంలోనే ఆలీ తన కూతురు పెళ్ళికి సీఎం జగన్ ను ఆహ్వానించారు. ఇటీవలే ఆలీ దంపతులు సీఎంను కలిసి తమ కుమార్తె వివాహానికి హాజరుకావాల్సిందిగా వెడ్డింగ్ కార్డు ఇచ్చి ఆహ్వానించారు. సీఎం జగన్ సైతం తప్పకుండ పెళ్ళికి వస్తాను అని తెలిపినట్లు సమాచారం. ఇక దీంతో పాటు జగన్ తో కొద్దిసేపు ముచ్చటించిన ఆలీ తనను ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version