Site icon NTV Telugu

Colours Swathi: ఆ హీరో శాడిస్ట్ బిహేవియర్ చూసి ఇక్కడినుంచి వెళ్ళిపో అన్నాను

Naveen

Naveen

Colours Swathi: కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్, సింగర్, హీరోయిన్ గా మల్టీట్యాలెంటెడ్ యాక్ట్రెస్. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఈ మధ్యనే స్వాతి రీ ఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె నవీన్ చంద్ర సరసన మంత్ ఆఫ్ మధు సినిమాతో పాటు పంచ తంత్రం సినిమాలో కూడా నటిస్తోంది. ఇక తాజాగా ఆమె నవీన్ చంద్ర గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నవీన్ చంద్ర ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. కథను బట్టి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోతున్నాడు.

తాజాగా అమ్ము అనే చిత్రం లో నవీన్ చంద్ర నటిస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నేపధథ్యంలోనే ఈ సినిమా ప్రీమియర్ కు స్వాతి హాజరు అయ్యింది. ఈ చిత్రంలో నవీన్ ఒక శాడిస్ట్ భర్త పాత్రలో నటించాడు. ఇక ఈ చిత్రాన్ని వీక్షించాకా స్వాతి మాట్లాడుతూ ” నవీన్ టాలీవుడ్ కు దొరికిన ఒక ముత్యం. అతను ఏ సినిమాలో నటించినా ఆ పాత్రకు న్యాయం చేస్తాడు. అమ్ము చిత్రం ఒక శాడిస్ట్ భర్తగా నవీన్ జీవించేశాడు. సినిమా మధ్యలో నవీన్ నా దగ్గరకు వచ్చాడు. నిజంగా ఆ సమయంలో అతడిని చూసి భయమేసింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనేశాను. అంతలా ఆ పాత్రకు కనెక్ట్ అయ్యాను. సినిమా చాలా బావుంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version