NTV Telugu Site icon

Chiru: మెగాస్టార్ పాటకి చిందేసిన కలెక్టర్…

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవి డాన్స్ కి ఉండే క్రేజే వేరు. ఆయన స్టైల్ అండ్ గ్రేస్ అన్ మ్యాచబుల్ అసలు. అందుకే చిరు డాన్స్ చేస్తుంటే అభిమానులు మెస్మరైజ్ అయ్యి చూస్తుంటారు. ఆయన పాటకి డాన్స్ వేయాలనుకుంటారు, ఆయనలా డాన్స్ స్టెప్పులు వేస్తారు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు సంక్రాంతి వేడుకల్లో జరిగింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ శివశంకర్ స్టేజ్ పైన మెగాస్టార్ పాటకి సూపర్ స్టెప్పులేశాడు. వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘వేర్ ఈజ్ ది పార్టీ బాసు, వీర్ ఈజ్ ది పార్టీ’ సాంగ్ కి శివశంకర్ డాన్స్ వేసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోని ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు. గతేడాది ఇదే సంక్రాంతి సీజన్ కి రిలీజైన వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది.

వింటేజ్ చిరుని చూపిస్తూ దర్శకుడు బాబీ మెగా ఫ్యాన్స్ కి మాస్ పూనకాలు తెప్పించాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరు ఎన్నేళ్లు అయినా తన యాక్టింగ్ లో, డాన్స్ లో గ్రేస్ తగ్గదు అని మరోసారి నిరూపించాడు. ఇదిలా ఉంటే చిరు ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి రోజున టైటిల్ అనౌన్స్మెంట్ జరిగిన ఈ మూవీని బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ జానర్ లో విశ్వంభర తెరకెక్కుతోంది. మ్యూజికల్ లెజెండ్, ఆస్కార్ విన్నర్ కీరవాణి విశ్వంభర సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరు ఫాంటసీ జానర్ లో చేస్తున్న సినిమా ఇదే. పాన్ ఇండియా రిలీజ్ ని టార్గెట్ చేస్తున్న ఈ మూవీపై సాలిడ్ బజ్ ఉంది.

Show comments