CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ ప్రీమియర్ షో
- ప్రేక్షకులతో కలిసి చూడాలని హీరో నాని విజ్ఞప్తి.
- సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేస్తూ నాని ఎక్స్‌లో పోస్టు.
- నాని విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన..
- భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్న నాని నిబద్ధతను సీఎం అభినందన..
- అధికారిక ప్రక్రియను పాటించాలని సీఎం సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Reply: నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది పారడైజ్’ (The Paradise) సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23న నిర్వహించనున్న ప్రీమియర్ షోను హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని హీరో నాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా కోరారు. ఈ విషయమై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా చూడటం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని నాని పేర్కొన్నారు. ‘ది పారడైజ్’ ప్రీమియర్ షో సందర్భంగా అక్కడి ఓ థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని ఉందని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసు అధికారులను ట్యాగ్ చేస్తూ విజ్ఞప్తి చేశారు. సినిమాను ప్రేక్షకుల కోసమే రూపొందిస్తామని, అలాంటి ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి స్పందనను ప్రత్యక్షంగా అనుభవించడంలోనే నటుడిగా తనకు నిజమైన సంతృప్తి లభిస్తుందని నాని తన పోస్టులో పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే సినిమాను అభిమానించే వ్యక్తిగా ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Also Read
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
- Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'
ముఖ్యంగా తాను థియేటర్‌కు వచ్చే సమయంలో అమల్లో ఉన్న అన్ని నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని నాని స్పష్టం చేశారు. ప్రేక్షకుల భద్రత కూడా తమకు అత్యంత ముఖ్యమని పేర్కొంటూ.. తన విజ్ఞప్తిని సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి, సంబంధిత అధికారులు పరిశీలించాలని కోరారు. హీరో నాని చేసిన విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. భద్రతా మార్గదర్శకాలను గౌరవించడంతో పాటు, తెలంగాణకు చెందిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమాపై నాని చూపిస్తున్న నిబద్ధతను అభినందించారు.
We appreciate your respect for safety guidelines, @NameisNani, and your commitment for the film directed by our talented young Telangana director, @odela_srikanth.
To ensure seamless crowd management and public safety, please submit an official application to the designated… https://t.co/w8NAZOBzsd
— Revanth Reddy (@revanth_anumula) September 23, 2026
అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రీమియర్ షోకు హాజరయ్యేందుకు అధికారిక ప్రక్రియను అనుసరించాలని సీఎం సూచించారు. రద్దీని సజావుగా నిర్వహించడం, ప్రజల భద్రతను నిర్ధారించడం కోసం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారిక దరఖాస్తు సమర్పించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. నాని సమర్పించే దరఖాస్తును సంబంధిత పోలీసు బృందం పరిశీలించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీని కూడా ట్యాగ్ చేశారు.
తాజావార్తలు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
-
Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!