CM Pellam : ‘సీఎం పెళ్లాం’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంద్రజ, అజయ్ , జయసుధ , సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీఎం పెళ్లాం’. రమణా రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రమోషనల్‌లో భాగంగా సాంగ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ.. ‘ రాజకీయ నేపథ్యంలో సాగే మంచి సందేశాత్మక చిత్రమిది. దర్శకుడు గడ్డం రమణా రెడ్డి నాకు మంచి మిత్రుడు. ఆయన ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంది అంటే విని ఇంప్రెస్ అయ్యాను. ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చాను. సీఎంగా అజయ్, ఆయన భార్య పాత్రలో ఇంద్రజ నటన ఆకట్టుకుంటుంది. ఈ రోజు మా మూవీ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేశాం. హైదరాబాద్ నగరం గురించి చేసిన ఈ పాట మీ అందరికీ నచ్చుతుంది. త్వరలోనే మా ‘సీఎం పెళ్లాం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అన్నారు.
Also Read:Vikram : టాలీవుడ్ ఇండస్ట్రీని చూస్తే అసూయగా ఉంది
Also Read
నటి ఇంద్రజ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఒక మంచి సోషల్ కాన్సెప్ట్ తో వస్తోంది. సీఎం పెళ్లాం బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈసినిమాలో మా డైరెక్టర్ గారు చక్కగా చూపించారు. ఎంటర్ టైన్ మెంట్ ఇస్తూనే ఆలోచింపజేసే చిత్రమిది. ఇందులో ప్రతి ఒక్క సీన్‌కు మీరంతా కనెక్ట్ అవుతారు. మీ రియల్ లైఫ్‌లో చూసినవి, విన్నవి, జరిగిన ఇన్సిడెంట్స్ మా మూవీలో చూస్తారు. ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్‌ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఈ సినిమాను మీ ముందుకు త్వరలో తీసుకొస్తున్నాం. ఈ చిత్రానికి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు. అలాగే
దర్శకుడు గడ్డం రమణా రెడ్డి మాట్లాడుతూ.. ‘మా సీఎం పెళ్ళాం సినిమా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఈ రోజు రిలీజ్ చేసిన సాంగ్ హైదరాబాద్ నగరం నేపధ్యంగా రూపొందించాం. మన నగరం ఎలా ఉంది అని ఈ పాటలో చూపించాం. నేను అమెరికాలో ఉంటాను. కుండపోత వర్షం పడిన చుక్క నీరు నగరంలో నిలవదు. ఇక్కడ వర్షం వస్తే అంతే. నేను ఎవరినీ విమర్శించడం లేదు. నగరం బాగుండాలనే తపనతో చెబుతున్నా. ఒకే ఒక్కడు చిత్రంలో వన్ డే సీఎంను చూశాం. మా మూవీలో సీఎం పెళ్లాం బయటకు వస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. సామాజిక నేపథ్యమున్న చిత్రమిది. మంచి మెసేజ్ ఉంటుంది. ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. త్వరలోనే మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని అన్నారు.
- Tags
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!