Site icon NTV Telugu

CM Jagan: జాతీయ అవార్డుల్లో తెలుగు జెండా రెపరెపలాడింది

Jagan

Jagan

CM Jagan: 69 వ జాతీయ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. మునుపెన్నడు లేనివిధంగా ఈసారి తెలుగు జెండా రెపరెపలాడింది. తెలుగు ఖ్యాతిని పెంచిన సినిమాలకు అవార్డులు వరించాయి. ఇక దీంతో ఒక్కరిగా టాలీవుడ్ కాలర్ ను ఎగురవేసి.. తమ సత్తాను చూపించింది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు అవార్డులు వరించినవారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం.. విన్నర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు జెండా రెపరెపలాడింది అని ఆయన ప్రశంసించారు. ట్విట్టర్ ద్వారా అందరికి అభినందనలు తెలిపారు.

Purushottama charyulu: బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమా చార్యులు.. అసలు ఎవరు ఈయన..?

“69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు జెండా రెపరెపలాడింది!వారికి నా శుభాకాంక్షలు మరియు అభినందనలు.
అల్లుఅర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకోవడం.. దేవిశ్రీ ప్రసాద్ పుష్పకు ఉత్తమ సంగీతానికి జాతీయ అవార్డును గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఎస్ఎస్ రాజమౌళి గారు మరియు RRR యొక్క మొత్తం బృందం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డు మరియు 5 ఇతర అవార్డులను గెలుచుకోవడం మరింత సంతోషాన్ని ఇస్తుంది. ఇక చంద్రబోస్ గారు కొండ పొలం చిత్రానికి గాను ఉత్తమ సాహిత్యానికి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. మీరు మా అందరినీ చాలా గర్వించేలా చేసారు” అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version