కు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశం ముగిసింది. గత కొద్దిరోజులుగా టాలీవుడ్‌లో నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ల మధ్య నలుగుతున్న థియేటర్ల అద్దె మరియు పర్సంటేజ్ విధానంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక స్పష్టతనిచ్చింది. ఈ వివాదం కారణంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు తొలగిపోయింది. ముఖ్యంగా భారీ అంచనాలున్న ‘పెద్ది‘ సినిమా విడుదలకు లైన్ క్లియర్ కావడంతో చిత్ర యూనిట్ మరియు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పారదర్శకత కోసం మరియు రెండు వర్గాలకు (నిర్మాతలు, ఎగ్జిబిటర్లు) ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు ఛాంబర్ 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అద్దె విధానం మరియు పర్సంటేజ్ పద్ధతులపై కూలంకషంగా అధ్యయనం చేయనుంది. రాబోయే రెండు నెలల్లోగా ఈ కమిటీ తన పూర్తి స్థాయి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన చేస్తూ.. కమిటీ నివేదిక వచ్చే వరకు ఏ సినిమా విడుదల ఆగిపోకూడదని స్పష్టం చేసింది. చర్చలు కొనసాగుతున్నప్పటికీ సినిమాల రిలీజ్‌లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చింది. దీంతో పెద్ది వంటి పెద్ద ప్రాజెక్టులు షెడ్యూల్ ప్రకారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పరిశ్రమ క్షేమం కోసం అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని ఛాంబర్ కోరింది. ఈ కమిటీలో ఐదుగురు నిర్మాతలు, ఐదుగురు ఎగ్జిబిటర్లు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు ఉంటారని ఛాంబర్ తెలిపింది.
