Sree Leela : శ్రీలీల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆమె ఎంగేజ్ మెంట్ జరిగినట్టు ఉన్న ఆ ఫొటోలను చూసి.. ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు. నిజంగానే శ్రీలీల ఎంగేజ్ మెంట్ జరిగిందా అంటూ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఆ ఫొటోల్లో ఆమె బుగ్గలకు పసుపు పెడుతూ కొందరు ఆశీర్వదిస్తున్నారు. పైగా బిగ్ డే.. పూర్తి వివరాలు త్వరలో చెబుతా.. కమింగ్ సూన్ అంటూ ఆమె రాసుకొచ్చింది. ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే ఎంగేజ్ మెంట్, పెళ్లి అనే అనుకుంటారు. కానీ అసలు విషయం వేరే ఉంది. ఫ్యాన్స్ కు ఇది కూడా గుడ్ న్యూస్.
Read Also : Khaleja : రీ రిలీజ్ ట్రెండ్ లో ఖలేజాతో మహేశ్ మరో రికార్డు..
తిథి ప్రకారం నిన్న (శుక్రవారం) శ్రీలీల పుట్టిన రోజు. అందుకే బంధువులు, ఇండస్ట్రీ నుంచి కొందరు పెద్దలను శ్రీలీల తల్లి ఇంటికి పిలిచారు. వాళ్ల సంప్రదాయం ప్రకారం ఇలా పసుపు పెట్టి ఆమెను ఆశీర్వదించారు. కాకపోతే వాటిని క్లియర్ చెప్పకుండా శ్రీలీల సస్పెన్స్ క్రియేట్ చేసిందన్నమాట. ఇది చూసిన ఆమె అభిమానులు తెగ వర్రీ అయిపోతున్నారు. ప్రస్తుతానికి శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదని ఆమెనే రీసెంట్ గా స్వయంగా చెప్పింది. కాబట్టి ఫ్యాన్స్ ఇలాంటి సస్పెన్స్ లను చూసి కంగారు పడొద్దు. శ్రీలీల తెలుగులో రెండు సినిమాల్లో చేస్తోంది. రీసెంట్ గానే రాబిన్ హుడ్ తో వచ్చినా హిట్ దక్కలేదు.
Read Also : Aditi Bhavaraju : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సింగర్ అదితి భావరాజు..
