P.G. Vinda: ‘సినిమాటికా ఎక్స్‌పో’ ఆసియాలోనే రికార్డు: పి.జి. విందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2004 లో వచ్చిన అవార్డ్ విన్నింగ్ మూవీ గ్రహణం తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన పి.జి. విందా, తన అసాధారణ ప్రతిభతో అనతికాలంలోనే గొప్ప ఛాయాగ్రాహకుడు పేరు పొందారు. ది లోటస్ పాండ్ చిత్రంతో దర్శకుడిగానూ తనదైన ముద్ర వేశారు. రెండు దశాబ్దాలుగా సినీ రంగానికి సేవ చేస్తున్న పి.జి. విందా, ఎప్పటికప్పుడు నూతన సాంకేతికలను పరిచయం చేయడంలోనూ ముందుతుంటున్నారు. ఈ క్రమంలోనే ‘సినిమాటికా ఎక్స్‌పో’కు శ్రీకారం చుట్టారు. ఇటీవల హైదరాబాద్‌లోని నోవాటెల్ లో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఎస్. కృష్ణన్, తెలంగాణ ప్రభుత్వ ITE&C మరియు పరిశ్రమలు & వాణిజ్యం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎందరో సినీ దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. సరికొత్త సాంకేతికతను పరిచయం చేయడంతో పాటు, యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ.. హైదరాబాద్ ను సినిమా మరియు డిజిటల్ క్రియేటివిటీ కేంద్రంగా మలచడమే లక్ష్యంగా ‘సినిమాటికా ఎక్స్‌పో’ అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన పి.జి. విందా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Erra Cheera: తొలి తొలి ముద్దు సాంగ్ రీల్స్, షార్ట్ కాంటెస్ట్.. వీడియో పంపు లక్ష కొట్టు!
Also Read
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
- Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
- Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
- Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ఎందరో గొప్ప దర్శకులు, ప్రతిభగల సాంకేతిక నిపుణులు ఉన్నారు. అలాగే హైదరాబాద్ సినీ రంగానికి అనువైన చోటు. షూటింగ్ కి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి, షూటింగ్ కోసం రావాలంటే అందరికీ అనువుగా ఉంటుంది. అయితే అన్నీ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సాంకేతికంగా వెనకబడిపోయాం. ముఖ్యంగా కొత్త కెమెరాలు, క్రేన్ లు, ఇతర ఎక్విప్ మెంట్ లు మనకు ఆలస్యంగా పరిచయమవుతున్నాయి. అందుకే ఈ సినిమాటికా ఎక్స్‌పో నిర్వహించాలని తలపెట్టాము. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎక్విప్ మెంట్ గురించి ముందే తెలుస్తుంది. దాంతో సాంకేతికంగా ఇంకా మెరుగైన సినిమాలను అందించగలము, తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో మేము నిర్వహించిన సినిమాటికా ఎక్స్‌పో మొదటి ఎడిషన్ కి గొప్ప స్పందన లభించింది. ఆ ఉత్సాహంతోనే రెండో ఎడిషన్ ని మరింత అద్భుతంగా నిర్వహించాలని నిర్ణయించాము. దీనికి ఏకంగా విశేష స్పందన లభించి, ఏకంగా 38 వేల మంది హాజరు కావడం అనేది ఆసియాలోనే రికార్డు అని అన్నారు.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!