Site icon NTV Telugu

జూలై 31 నుంచీ… ‘జీ టీవీ’లో జబర్ధస్త్ కామెడీ!

Zee TV will launch a new comedy show called "Comedy Factory" on June

సినిమాలు, సీరియల్స్, కొత్తగా వెబ్ సిరీస్ లు… ఎంటర్టైన్మెంట్ అంటే ఇంతేనా? కాదంటోంది జీ టీవీ! జూలై 31 నుంచీ ‘కామెడీ ఫ్యాక్టరీ’ని ప్రారంభించబోతున్నారు ఛానల్ నిర్వాహకులు. బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించబోతోంది. ఆమెని ‘లాపింగ్ బుద్దా’గా పిలుస్తారట. షోలో పాల్గొన్న కమెడియన్స్ ఫరాని కడుపుబ్బా నవ్వించాల్సి ఉంటుంది…

Read Also : “రౌడీ బేబీ” ఖాతాలో మరో న్యూ రికార్డు

ఓ జడ్జ్ ను ఎదురుగా కూర్చోబెట్టుకుని తమ కామెడీతో నవ్వించటం అంటే మనం రెగ్యులర్ గా చూసే ‘జబర్ధస్త్’ ఫార్మాటే అనిపించటం సహజమే! కానీ, ‘జీ కామెడీ ఫ్యాక్టరీ’లో అన్ని రకాల వినోదాలు ఉంటాయట. స్కిట్స్, స్టాండప్ కామెడీ, పేరడీలు, స్పూఫ్స్… ఇలా ప్రతీది కితకితలు పెట్టబోతోంది. ఇక కామెడీ ఫ్యాక్టరీలో తమ రిబ్ టిక్లింగ్ కామెడీతో ప్రేక్షకుల్ని అలరించబోతున్న వారు అందరికందరూ టాలెంటెడ్ సీనియర్ కమెడియన్సే! అలీ అస్గర్, సుగంధ మిశ్రా, సింగర్ ఆదిత్య నారాయణ్ లాంటి చాలా మంది షోలో కనిపించబోతున్నారని సమాచారం.

Exit mobile version