“రౌడీ బేబీ” ఖాతాలో మరో న్యూ రికార్డు

విడుదలైన రెండున్నర సంవత్సరాల తరువాత కూడా యూట్యూబ్‌లో “రౌడీ బేబీ” ఇంకా సునామీ సృష్టిస్తూనే ఉంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన “మారి 2” చిత్రంలో ఈ “రౌడీ బేబీ” సాంగ్ ఉంది. ఈ మూవీ 2018 లో తెరపైకి వచ్చింది. సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా సాంగ్ మాత్రం అదరగొడుతోంది. ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. ఈ సాంగ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో తిరుగులేని చార్ట్‌బస్టర్‌గా మిగిలిపోయింది. ఇప్పటికే చాలా రికార్డులను బద్దలు కొట్టిన “రౌడీ బేబీ” వీడియో సాంగ్ ఇప్పుడు మరో కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది.

Read Also : కృతి సనన్ ప్రెగ్నెన్సీ జర్నీ… “మిమి” టీజర్

యూట్యూబ్‌లో 5 మిలియన్ లైక్‌లు పొందిన మొదటి దక్షిణ భారతదేశం సాంగ్ గా ఇది నిలిచింది. ఈ యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సాంగ్ అత్యంత వేగంగా ఈ ఫీట్ ను అందుకున్న సాంగ్ కూడా కావడం విశేషం. ఈ సాంగ్ కు ధనుష్, సాయి పల్లవి వేసిన ఎలక్ట్రిక్ డాన్స్ స్టెప్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో సాంగ్ మ్యూజిక్ తో పాటు వారి డ్యాన్స్, కాస్ట్యూమ్స్ కూడా ప్రధాన పాత్ర పోషించాయి. ఈ సూపర్ హిట్ ట్రాక్ కోసం ప్రభుదేవా, జానీ మాస్టర్ సంయుక్తంగా డ్యాన్స్ ను కంపోజ్ చేశారు. ఇది యుట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన సౌత్ సాంగ్ అంతేకాదు 1.1 బిలియన్లకు పైగా వీక్షణలు సాధించిన సాంగ్ కూడా ఇదే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-