నకిలీ మద్యం గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో ప్రవర్తించిన తీరును, ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఘాటు విమర్శలు గుప్పించారు.
Also Read :RakulPreetSingh : కారుమబ్బులు కమ్మినవేళ.. సెగలు రాజేస్తున్న రకుల్ ప్రీత్
జగన్ మాట్లాడుతూ, “బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతిచ్చారు?” అని ప్రశ్నించారు. బాలకృష్ణ చేసిన సంభాషణలు ‘పనీపాట లేనివి’ అని, “అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడిందేంటి?” అని నిలదీశారు. దీని ద్వారా బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతోంది అంటూ ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు.
Also Read :MEGA 157 : మన శంకరవరప్రసాద్ సెట్స్ లో అడుగు పెట్టిన పెళ్లికాని ప్రసాద్
అంతేకాకుండా, తాగిన వ్యక్తిని అసెంబ్లీలోకి అనుమతించినందుకు స్పీకర్‌పైనా జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “తాగిన వారిని అసెంబ్లీలోకి అనుమతించిన స్పీకర్‌కు బుద్ధి లేదు,” అంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటే, బాలకృష్ణ సైకలాజికల్ హెల్త్ ఎలా ఉందో చూసుకోవాలి అని జగన్ అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
