Site icon NTV Telugu

Harsha Sai: హర్ష సాయి ఆడియో లీక్.. ఇదెక్కడి ట్విస్ట్ మావా?

Harsha Sai Audio Leaked

Harsha Sai Audio Leaked

YouTuber Harsha Sai Phone Call Leaked Audio: తెలుగులో స్టార్ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న హర్ష సాయి మీద రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనను పెళ్లి పేరుతో నమ్మించి రెండు కోట్ల రూపాయల మేర మోసం చేశాడంటూ గతంలో ఒక బిగ్ బాస్ సీజన్ లో కనిపించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు మత్తుమందు ఇచ్చి తాను స్పృహ తప్పాక తన న్యూడ్ వీడియోలు తీసుకుని వాటిని చూపించి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఆమె ఆరోపించింది.

Prakash Raj: పవన్ కి ప్రకాష్ రాజ్ మరో కౌంటర్.. ఆ ఆనందమేంటో?

అయితే దీని మీద హర్ష సాయి స్పందిస్తూ తన మీద వచ్చిన ఆరోపణలు ఏవి నిజం కాదని, డబ్బు కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. తన న్యాయవాది ఈ విషయం మీద స్పందిస్తాడని ఆయన పేర్కొన్నారు. సదరు న్యాయవాది కూడా స్పందిస్తూ హర్ష సాయి తప్పేమీ లేదని ఇప్పుడు ఈ కేసు వల్ల ఆయన పరువు పోయిందంటూ కామెంట్ చేశారు. ఇదంతా ఇలా సాగుతున్న సమయంలో ఒక ఆడియో కాల్ లీక్ అయింది. ఇందులో హర్ష సాయి మీద కేసు పెట్టిన అమ్మాయితో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వినండి.

Exit mobile version